Davos Tour: పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ కు కేటీఆర్..
KTR Davos Tour; రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్ బయలుదేరనున్నారు. ఈ నెల 16 నుంచి దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్-2023 జరగనుండగా ఈ సమ్మిట్ లో కేటీఆర్ పాల్గొననున్నారు. 2018 నుంచి ఐటీ మినిస్టర్ హోదాలో కేటీఆర్.. దావోస్ పర్యటనకు వెళ్తున్న సంగతి అందరికీ విదితమే. ప్రపంచంలోనే టాప్ కంపెనీల సీఈవోలు పాల్గొనే ఈ సమ్మిట్ లో వారితో భేటీ అయి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కేటీఆర్ కోరనున్నారు. కేటీఆర్ దావోస్ పర్యటన కారణంగా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక అక్కడ కేటీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రవాస భారతీయులు సిద్ధంగా ఉన్నట్లు బీఆర్‌ఎస్ స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గందె శ్రీధర్ వెల్లడించారు. ఈనెల 15వ తేదీన జురిక్ నగరంలో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలోనూ కేటీఆర్ పాల్గొననున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2018 సంవత్సరంలో మొదటిసారి ఐటీ మినిస్టర్ హోదాలో కేటీఆర్.. దావోస్ పర్యటనకు వచ్చారని ప్రపంచంలోనే టాప్ కంపెనీల సీఈవోలు పాల్గొనే ఈ సమ్మిట్‌లో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచే విధంగా కేటీఆర్ పర్యటన దోహదపడిందని అన్నారు.