KTR: మోడీ వల్లే ఆర్ఆర్ఆర్ పాటకు ఆస్కార్ వచ్చిందా? బండి సంజయ్ పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
KTR targets bandai Sanjay basing on his Previous comments on RRR Movie
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శల పాలౌతున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ నేతలు బండి సంజయ్ దిష్టిబొమ్మలను తగులబెట్టారు. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ రావడంపై బండి సంజయ్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ విషయం గ్రహించిన గులాబీ నేతలు గతంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శించే థియేటర్లను తగులబెడతామని వార్నింగ్ ఇచ్చారు.
ఆర్ఆర్ఆర్ సినిమా పాటకు ఆస్కార్ దక్కడంపై శుభాకాంక్షలు తెలిపిన కొణతం దిలీప్ ..గతం బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. ఆ సినిమాపై ఎంతో విషం చిమ్మారని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన మంత్రి కేటీఆర్ ..తాను కూడా స్పందించారు. ట్విట్టర్ వేదికగా బండి సంజయ్ ను టార్గెట్ చేశారు. నరేంద్ర మోడీ కారణంగానే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు దక్కిందని ఈ మతోన్మాది త్వరలోనే చెబుతాడని కేటీఆర్ ఎద్దేవాచేశారు.
Not before long, the SAME Bigot will tell you the Award was given only because of Modi 😂 https://t.co/8Z0hp6FETl
— KTR (@KTRBRS) March 13, 2023