K.T.R Comments: దేశ రక్షణ రంగంలో హైదరాబాద్‌లోని రక్షణ పరిశ్రమలది కీలక పాత్ర
దేశ రక్షణ రంగంలో హైదరాబాద్‌లోని రక్షణ పరిశ్రమలది కీలక పాత్ర అని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ వంటి రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వ ప్రోత్సహించాలని కోరారు. . సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో NIMSలో VEM పరిశ్రమ నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ బెంగళూర్ నగరాల మధ్య ఢిపెన్స్ కారిడార్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని పలుమార్లు కోరిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. ఎన్నిసార్లు కోరినప్పటికీ ప్రయోజనం కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. డిఫెన్స్ కారిడార్‌ను బుందేల్ ఖండ్‌కు తరలించారని కేటీఆర్ విమర్శించారు. అభివృద్ది చెందుతున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు కేంద్రం అండగా నిలబడాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీపై పలు విమర్శలు
జహారాబాద్ బాగారెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై పలు విమర్శలు చేశారు. ఇటీవలే తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీ చేసిన కామెంట్లను ప్రస్తావించారు. రాహుల్ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 50 సంవత్సరాలకు పైగా అధికారం ఇచ్చానని…ఆ సమయంలోనే ఏమీ చేయలేకపోయిన కాంగ్రెస్ ఇప్పుడు మాత్రం అధికారం ఇస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు.
జహీరాబాద్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. జహీరాబాద్ మున్సిపాలిటీ అయిన తర్వాత ఒకేసారి 50 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని కేటీఆర్ అన్నారు. మహిళల కోసం వెజ్ మార్కెట్, నాన్‌వెజ్ మార్కెట్లను నిర్మిస్తున్నట్లు గుర్తుచేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.