KTR: దేశానికి హైదరాబాద్ లాంటి నగరాల అవసరం ఉంది – కేటీఆర్
KTR highlights the significant growth of Hyderabad City in CII meet
హైదరాబాద్ నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. దేశానికి హైదరాబాద్ వంటి నగరాల అవసరం ఉందని అన్నారు. సీఐఐ సదస్సులో పాల్గొన్న కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. జినోమ్ మెడికల్ డివైసెస్ పార్క్ ను విస్తరిస్తున్నామని మంత్రి తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల పెట్టుబడులకు ముందుకు రండని పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం సహకరించడం లేదనే విషయాన్ని కేటీఆర్ మరోసారి గుర్తుచేశారు. మేకిన్ ఇండియా మంచి నినాదం..అమలయిందా అని ప్రశ్నించారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు కేంద్రం చేయూత ఇవ్వాలని కోరారు. భారతదేశం అంటే రాష్ట్రాల సమూహం అని గుర్తుచేశారు.
మళ్లీ అధికారంలోకి తామే వస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మరిన్ని సీఐఐ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.హైదరాబాద్ మొబిలిటీ కేంద్రంగా మారుతుందని, లైఫ్ సైన్సెస్‌తో పాటు టెక్నాలజీ రంగానికి హైదరాబాద్ అత్యుత్తమ వేదికగా ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు హైదరాబాద్‌లో తమ కేంద్రాలను ఏర్పాటు చేశాయని గుర్తుచేశారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని కేటీఆర్ తెలిపారు.