KTR: చేనేతపై పన్ను వేసిన గొప్ప వ్యక్తి మోడీ, కేటీఆర్ సెటైర్లు
KTR fires on BJP leaders
బీజేపీ నేతలు చేస్తున్న పలు విమర్శలకు మంత్రి కేటీఆర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఇటీవల జరిగిన సెస్ ఎన్నికల గురించి ప్రస్తావించారు. గుజరాత్‌లో దోచుకున్న సంపద సెస్ ఎన్నికల్లో బీజేపి వాళ్ళు ఖర్చు చేశారని కేటీఆర్ విమర్శించారు. నాలుగున్నర కోట్ల డబ్బులు పంచి మళ్ళీ వాళ్ళే గొడవ చేస్తున్నారని మండిపడ్డారు. సెస్‌కి పాలక వర్గం నామినేట్ చేస్తే కోర్టుకు పోయారని, కోర్టుకి పోతే విపు పగిలిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
బీజేపీ నాయకులను, కార్యకర్తలకు కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. మొన్న సెస్ ఎన్నికల్లో చూసింది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా 2023 లో చూడండని సవాలు విసిరారు.
ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తే యువతను దూరం చేస్తున్నారని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేస్తున్నా బీజేపీకి కనిపించడం లేదని కేటీఆర్ ఫైర్ అయ్యారు. అదే విధంగా మోడీ దేవుడు అంటూ బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్లపైనా కేటీఆర్ స్పందించారు.మోడీ ఎవడికి దేవుడని ప్రశ్నించారు. బండి సంజయ్‌కి, గుజరాత్ వాళ్ళకి మోడీ దేవుడు కావచ్చు కానీ తెలంగాణ ప్రజలకు కాదని కేటీఆర్ అన్నారు.
సిలిండర్, పెట్రల్ ధరలు పెంచితే దేవుడు అవుతాడా అని ప్రశ్నించారు. గిరిజన రిజర్వేషన్లు పెంచని వాడు దేవుడా అని ప్రశ్నించారు. చేనేతపై పన్ను వేసిన గొప్ప వ్యక్తి మోడీ అని ఎద్దేవా చేశారు. బస్సు చార్జీలు మేము పెంచితే గగ్గోలు చేస్తున్నారు .. బస్సు చార్జీలు పెంచకుండా ఆర్టీసిని ఎలా కాపాడాలని ప్రశ్నించారు.
కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ప్రజల మధ్య కొట్లాట జరుగుతుందని, రెండు రాష్ట్రాల్లో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే ఉందని, రెండు రాష్ట్రాల మధ్య గట్టు పంచాయితే తెంపనోడు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం అపాడట అంటూ ఎద్దేవా చేశారు.
కేంద్రం అందిస్తున్న నిధుల విషయంలోనూ అన్యాయం జరుగుతుందని మరోసారి గుర్తుచేశారు. 3 లక్షల 68 వేల కోట్లు కేంద్రానికి మనం కడితె తిరిగి 2 లక్షల కోట్లు ఇచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. నేను చెప్పిన లెక్క తప్పయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు.