Komati reddy: తనను చంపుతానని కొందరు బెదిరిస్తున్నారు, పోలీసులకు కోమటిరెడ్డి ఫిర్యాదు
Komati reddy Venkat reddy gets death threats, compliant to Police
భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తనను కొంత మంది చంపుతానని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తనను చంపుతామని వీడియోలు పోస్టు చేశారంటూ పోలీసులకు తెలియజేశారు. తనను బెదిరించిన వారు చేసిన వీడియో చాటింగ్ లను పోలీసులకు అందజేశారు. కోమటి రెడ్డి పిర్యాదు పైన బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కొన్ని రోజుల క్రితమే..
ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి చెందిన చెరుకు సుధాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఫిర్యాదు చేశారు. తనను తన కుటుంబాన్ని చంపేందుకు కోమటిరెడ్డి కుట్ర పన్నుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను, తన కుటుంబ సభ్యులను చంపేందుకు తన అభిమానులు తిరుగుతున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమకు వార్నింగ్ ఇచ్చారని చెరుకు సుధాకర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
చెరుకు సుధాకర్
చెరుకు సుధాకర్ 2021లో జరిగిన తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో తెలంగాణ ఇంటి పార్టీ అభ్యర్థిగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2022 ఆగష్టు 5వ తేదీన తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి AICC కార్యాలయంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు.