Kishan reddy: నా లేఖలకు జవాబిచ్చే సంస్కారం కేసీఆర్ కు లేదు – కిషన్ రెడ్డి ఫైర్
Kishan reddy fires on Telangana CM KCR
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ సర్కారుపై మరోసారి మండిపడ్డారు. గులాబీ నేతలు ప్రజలను తప్పుడు దోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల మంజూరు విషయంలో కేంద్రంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
వివిధ ప్రాజెక్టుల పై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని, లెటర్లు రాస్తున్నామని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ నేను పదేపదే ఉత్తరాలు రాశానని … ఒక్క జవాబు కూడా సీఎం నుండి రాలేదని కిషన్ రెడ్డి గుర్తుచేశారు.
తన లేఖలకు సమాధానం చెప్పని కేసీఆర్ అనేక విమర్శలు చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణకు మోడీ, కిషన్ రెడ్డి ఏమీ చేశారని కెసిఆర్, ఆయన కుమారుడు అడుగుతున్నారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
కేంద్ర మంత్రులకు ప్రజాప్రతినిధుల నుండి వచ్చే లేఖలను ప్రాసెస్ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉంటుందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ కు జవాబు ఇచ్చే సంస్కారం లేదని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదని కిషన్ రెడ్డి అన్నారు. ట్రైబల్ మ్యూజియం కోసం భూమి ఇవ్వాలని అడిగితే ఇవ్వేలేదని, కేంద్రం కోటి రూపాయలు ఇచ్చిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు.