Kishan Reddy : టాయిలెట్స్ శుభ్రం చేసిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
Kishan Reddy cleaned the toilets: స్వచ్ఛభారత్ కోసం కేంద్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని జామై ఉస్మానియా ప్రభుత్వ పాఠశాలలో హై ప్రెజర్ టాయిలెట్ క్లీనింగ్ మిషన్లను ఆయన పంపిణీ చేశారు. అనంతరం కిషన్ రెడ్డి.. ప్రభుత్వ పాఠశాల్లోని టాయిలెట్లను శుభ్రం చేశారు.
పేద, మధ్య తరగతి పిల్లలు చదువుకునే గవర్నమెంట్ స్కూల్ లలో టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ సహకారంతో సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఓయూ గవర్నమెంట్ స్కూల్ లో హై ప్రెషర్ టాయిలెట్ క్లీనింగ్ మిషన్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు జిల్లా విద్యా శాఖ అధికారి రోహిణి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
ఇలాంటి పాఠశాలల్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకపోయినా తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. టాయిలెట్స్ శుభ్రంగా లేనట్లయితే దాని ప్రభావం పిల్లల ఆరోగ్యంపై, వారి చదువుపై కూడా ఉంటుందని చెప్పారు. కాబట్టి వాటిని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత టీచర్స్ పై ఉందని కిషన్ రెడ్డి తెలిపారు.
Distributed High-Pressure Toilet Cleaning Machines to representatives of Government Schools from Secunderabad Parliamentary Constituency, at Govt High School at Jamia Osmania, Vidyanagar, Secunderabad. pic.twitter.com/ru1vV2pn1D
— G Kishan Reddy (@kishanreddybjp) December 10, 2022