CM KCR Wife: సీఎం కేసీఆర్ భార్యకు అస్వస్థత, ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స
KCR Wife was admitted into AIG Hospital in Gachibowli
సీఎం కేసీఆర్ సతీమణి శోభ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. సీఎం కేసీఆర్ తో పాటు కుమార్తె కవిత కూడా ఆసుపత్రికి తోడుగా వెళ్లారు. కేసీఆర్ కుటుంబానికి చెందిన అనేక మంది సభ్యులు కూడా ఏఐజీ ఆసుపత్రికి తరలి వచ్చారు. ప్రస్తుతం ఏఐజీ ఆసుపత్రి వైద్యులు కేసీఆర్ సతీమణికి వైద్యం అందిస్తున్నారు. సీఎం సతీమణి ఏ అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చేరారనే విషయం ఇంకా తెలియలేదు.
ఆసుపత్రికి వెళ్లడానికి ముందు ఎమ్మెల్సీ కవిత సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్లో కలిశారు. ఈడీ విచారణ సందర్భంగా ఏ ఏ విషయాలను ప్రస్తావించారనే విషయాన్ని కవిత, సీఎంకు వివరించారు. ఈ నెల 16వ తేదీన మరోసారి ఈడీ విచారణకు హాజరు కావడానికి కవిత వెళ్లనున్న సందర్భంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయమై సీఎం కేసీఆర్ కవితతో చర్చించినట్లు సమాచారం. కవిత, సీఎంను కలిసి సందర్భంగా మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ అక్కడే ఉన్నారు.
ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఉన్న కవిత, సీఎం కేసీఆర్ ను మరోసారి కలవనున్నారు. ఈడీ తదుపరి విచారణ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తల విషయంలో సూచనలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.