KTR : మాటలు జాగ్రత్త… సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయం
KCR Hat trick as CM says KTR : తాజాగా జరిగిన చిట్ చాట్ లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయమని, 8 ఏళ్ల పాలన తర్వాత కూడా టిఆర్ఎస్ పాలనకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, కాంగ్రెస్, బిజెపి సర్వేలు ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయని పేర్కొన్నారు.
కేటీఆర్ మాట్లాడుతూ పికే ఇచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా కొన్ని నిర్ణయాలు ఉంటాయని, 8 ఏళ్ల తరవాత కూడా సర్వేలు కేసిఆర్ మళ్ళీ గెలుస్తాడు అని చెబుతున్నాయని, దక్షిణ భారతంలో కేసిఆర్ హ్యాట్రిక్ విజయం సాధించబోతున్న మొదటి సీఎం కేసిఆర్ అని, ఎనిమిదేళ్ల తర్వాత కూడా ప్రజల్లో మంచి స్పందన వస్తుందంటే కేసీఆర్ కు, టిఆర్ఎస్ పాలనకు అది నిదర్శనమని, రాష్ట్రం మొత్తం ఒక్క టిఆర్ఎస్ పార్టీనే ఉందని, 90కి పైగా స్థానాలు వస్తాయని తమ సర్వే చెబుతుందని వెల్లడించారు.
బిజెపి డబుల్ ఇంజిన్ అంటే మోడీ, ఈడినే అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇక పార్టీలో అంతర్గత విభేదాలు పార్టీ బలంగా ఉందనడానికి నిదర్శనమని, పార్టీలు మారడం సర్వ సాధారణమని, కలిసి పార్టీని నడిపించకపోతే ఇబ్బందులు తప్పవని, అందుకే తాను పార్టీలో చాలామంది నేతలను కలుస్తూ ఉంటానని స్పష్టం చేశారు. ఇక ఈటల వస్తే తమ పార్టీలోకి తీసుకుంటాం అనేది ఊహాజనితం అని, క్షేత్రస్థాయిలో తమ పార్టీలోని అత్యంత బలమైన నేతకు టికెట్ ఇస్తామని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు.
కాగా మోడీ గతంలో చాలా మాట్లాడారని గుర్తు చేసిన కేటీఆర్ రూపాయి విలువ తగ్గడం పై కామెంట్ చేసి, గడ్డం తీసుకుంటా అన్నవారు రంగులేసుకుని తిరుగుతున్నారని, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికి రెండుసార్లు రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నాడని, లగడపాటినీ మెచ్చుకోవాలని, మొన్నటి బిజెపి సర్వే, నిన్నటి కాంగ్రెస్ సర్వే టిఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పాయని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పుకొచ్చారు.