మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత సీఎం కేసీఆర్ గురువారం రాత్రి 8 గంటలకు ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ ప్రెస్‌మీట్‌లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, మోడీపై విరుచుకుపడ్డారు. ఇటీవల ఎమ్మెల్యేల కొనుగోలు విషయం బయటకు వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ దీనిపై సీరియస్‌గా ఉన్న సంగతి తెలిసిందే.
KCR: మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత సీఎం కేసీఆర్ గురువారం రాత్రి 8 గంటలకు ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ ప్రెస్‌మీట్‌లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, మోడీపై విరుచుకుపడ్డారు. ఇటీవల ఎమ్మెల్యేల కొనుగోలు విషయం బయటకు వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ దీనిపై సీరియస్‌గా ఉన్న సంగతి తెలిసిందే. నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ కొనగోలు అంశానికి సంబంధించి వీడియోలు, ఆడియోలను ప్రదర్శిస్తూ ధ్వజమెత్తారు.
దేశంలో ఇప్పటికే 8 ప్రభుత్వాలను కూల్చారని, ప్రభుత్వాలను కూల్చేందుకు ఏర్పాటు చేసిన ముఠాలో మొత్తం 24 మంది ఉన్నట్లుగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్‌లోని ప్రభుత్వాలను కూల్చాలని చూస్తున్నారని, ఈ ముఠాకు వేలకోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయని, ఈ ముఠాకు నాయకుడు ఎవరనే వివరాలు తెలియాలని, వివరాలన్నింటిని బయటకు లాగుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఈ అంశాన్ని లేవనెత్తుతామని, వదిలే సమస్యలేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.