కొత్త సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన కేసీఆర్
కొత్త సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. 5వ సారి కొత్త సెక్రటేరియట్ వెళ్లారు సీఎం కేసీఆర్. సమీకృత సచీవాలయ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు మరో 20 శాతం పనులు ఈ మూడు నెల్లల్లో పూర్తి చేస్తే దసరా నాటికి ఈ సెక్రటేరియట్ అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.
2020 అక్టోబర్ 28 కొత్త సెక్రటేరియట్‌కు టెండర్లు ఖరారయ్యాయి. ఈ భవన నిర్మాణ పనులను ప్రముఖ సంస్థ చేపడుతుంది. అంతకు ముందే ప్రభుత్వం పాత భవనాన్ని కూల్చివేసింది. 2021వ సంవత్సరం జనవరి 26న మొదటి సారి నిర్మాణ పనులను పరిశీలించిన కేసీఆర్.. ఆ తర్వాత మార్చి 18 రెండవ సారి, ఆగస్టు 7న మూడోసారి, డిసెంబర్ 9 నాలుగోవ సారి నిర్మాణ పనులను పరిశీలించారు. జనవరి 9న సచివాలయ పనులపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.,