Kavitha Delhi Tour: ఢిల్లీకి కవిత… మహిళా రిజర్వేషన్ బిల్లులపై రౌండ్ టేబుల్ సమావేశం
Kavitha Delhi Tour: తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈరోజు ఉదయం ఆమె ఢిల్లీ వెళ్లారు. మార్చి 10వ తేదీన కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరసన దీక్ష చేశారు. కాగా, నేడు ఈ బిల్లుపై ఢిల్లీలోని మెరీడియన్ హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించనున్నారు. ఈ సమావేశం తరువాత మార్చి 16వ తేదీన కవిత ఢిల్లీలోని ఈడీ ముందు హాజరుకానున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ మార్చి 11వ తేదీన కవితను ఒకమారు విచారించింది. మరలా మార్చి 16వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల ప్రకారం ఆమె ఈడీ ముందు హాజరుకానున్నారు. రేపటి విచారణలో ఈడీ ఎలాంటి ప్రశ్నలు సంధిస్తుందో చూడాలి. ఈడీ విచారణకు తాను సహకరిస్తానని ఇప్పటికే కవిత స్పష్టం చేసింది. కవిత వినియోగిస్తున్న ఫోన్‌ను ఈడీ అధికారులు మార్చి 11వ తేదీన స్వాధీనం చేసుకున్నారు.