Kavitha to attend ED Office today: కాసేపట్లో ఈడీ ముందుకు కవిత… కవిత ఇంటిముందు పోలీసులు భారీ బందోబస్తు
Kavitha to attend ED Office today: కాసేపట్లో ఈడీ ముందుకు కవిత హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కవిత ఇంటివద్ద ఢిల్లీ పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. అటు కేసీఆర్ నివాసం వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయడంతో ఏ జరుగుతందోననే ఉత్కంఠత నెలకొన్నది. కవిత అరెస్ట్ తప్పదంటూ వార్తలు ప్రచారం జరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇంటివద్ద 144 సెక్షన్ విధించారు. కవిత నివాసానికి ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, శంభిపుర్ రాజులు వెళ్లారు. కవితతో ముచ్చటించారు. ఇక ఇదిలా ఉంటే, ఈ రోజు ఉదయం 11 గంటలకు కవిత ఈడీ కార్యాలయానికి చేరుకోనున్నారు.
ఉదయం 11 గంటల నుండి ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించే అవకాశం ఉన్నది. మొదట కవిత నుండి స్టేట్మెంట్ తీసుకోనున్నారు. ఈ స్టేట్మెంట్ అనంతరం సౌత్ గ్రూప్ పై ప్రశ్నించే అవకాశం ఉంది. సౌత్ గ్రూప్‌లో కవిత బినామీగా ఉన్నారని ఈడీ ఇప్పటికే ఆధారాలు సేకరించింది. రామచంద్ర పిళ్లై, బుచ్చిబాబుల నుండి ఈడీ ఇప్పటికే స్టేట్మెంట్లు తీసుకున్నది. ఆ ఇద్దరూ ఆమె ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారని స్టేట్మెంట్లు ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్ ఆధారంగానే కవితను విచారించనున్నారు. కవితను ఈడీ అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారన్నది చూడాలి. అరెస్ట్ తప్పదని వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజకీయాల్లో వేడి రగులుకున్నది.