Delhi liquor Scam: విచారణ హాజరుపై సమయం కోరుతా- కవిత
Kalvakuntla Kavitha may seek some more time to attend ED investigation
ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఒక్కక్కరినీ విచారణ చేస్తూ అనేక విషయాలు రాబడుతోంది. తాజాగా ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసింది. తనకు ఈడీ నోటీసులు వచ్చిన విషయాన్ని కవిత ధృవీకరించారు. ఢిల్లీలో ధర్నా కారణంగా విచారణకు హాజరు కాలేనని, విచారణకు హాజరు కావడానికి సమయం కోరతానని కవిత తెలిపారు. రేపటి విచారణపై న్యాయ సలహాలు తీసుకుంటానని, దర్యాప్తు సంస్థలకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని కవిత తెలిపారు. విచారణ హాజరుకు సమయం కోరుతానని, చట్టాన్ని గౌరవిస్తానని కవిత స్పష్టం చేశారు.
కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటాలను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోందని కవిత మండిపడ్డారు. ఇటువంటి బెదిరింపులు తనను ఏమీ చేయలేవని కవిత అన్నారు. భారత దేశపు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వపు వైఫల్యాలను ఎండగడతామని కవిత స్పష్టం చేశారు.
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మార్చి 10వ తేదీన భారత జాగృతి నేతృత్వంలో ధర్నా చేస్తున్నామని, మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నట్లు కవిత తెలిపారు. తాను ఢిల్లీలో చేపడుతున్న దీక్షకు దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి మహిళలు వస్తున్నారని కవిత తెలిపారు.