TS High Court: ఆల్ ఇండియా సర్వీసు అధికారుల కేటాయింపు విచారణ ఈనెల 27 కు వాయిదా
Judgement on 11 All India Service officers was postponed to January 27
ఆల్ ఇండియా సర్వీసు అధికారుల కేటాయింపు విచారణ ఈనెల 27 కు వాయిదా పడింది. ఈ విషయమై రెగ్యులర్ బెంచ్ విచారిస్తుందన్న ధర్మాసనం స్పష్టం చేసింది. వ్యక్తిగత వాదనలు వినిపిస్తామని పిటిషనర్ల లాయర్లు కోర్టుకు తెలిపారు.
ఆలిండియా సర్వీసుకు చెందిన 11 మంది అధికారుల భవిష్యత్తు మరికొన్ని రోజుల్లో తేలనుంది.. 9 మంది ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారుల క్యాడర్ అలాట్ మెంట్ పై హైకోర్ట్ తీర్పు ఇవ్వనుంది. ఐఏఎస్ అధికారుల్లో వాణీ ప్రసాద్, వాకాటి అరుణ, రోనాల్డ్ రాస్, ఆమ్రపాలి తదితరులు తెలంగాణ హైకోర్టు ఇచ్చే తీర్పుతో ప్రభావితం కానున్నారు. వారితో పాటు తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ పై రానున్న తీర్పు కూడా పాలనపై ప్రభావం చూపనుంది.
తెలంగాణ చీఫ్ సెక్రటరీగా ఉన్న సోమేష్ కుమార్ విషయంలో తెలంగాణ హైకోర్టు స్పష్టమైన తీర్పును ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీ పదవి నుంచి తప్పుకున్నారు. ఏపీలో రిపోర్టు చేశారు. సోమేష్ కుమార్ ఏపీ సీఎం జగన్ ను కలిసి రిపోర్టు చేశారు.