JEE Main 2023 Exam: రేపటినుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు
JEE Main 2023 Exam: ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో నిర్వహించే జేఈఈ మెయిన్ తొలివిడత పరీక్షలురేపటి నుండి నుంచి ప్రారంభం కానున్నాయి. 24న ప్రారంభమై ఫిబ్రవరి 1వ తేదీతో పరీక్షలు ముగుస్తాయి. రెండోవిడత ఏప్రిల్ 6 నుంచి వారంపాటు నిర్వహించనున్నారు. రెండు సెషన్లలో వచ్చిన ఉత్తమ స్కోర్ ఆధారంగా జూన్ 4న జరిగే అడ్వాన్స్ పరీక్షకు అర్హత కల్పిస్తారు.
అదేవిధంగా బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి పేపర్-2 పరీక్ష జనవరి 28న రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. ఇప్పటికే జేఈఈ మెయిన్ పరీక్ష హాల్‌టికెట్లను ఎన్టీఏ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొదటి షిఫ్ట్ పరీక్షకు ఉదయం 7 గంటల నుంచి, మధ్యాహ్నం పరీక్షకు 1 గంట నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిమిషం ఆలస్యం అయిన అనుమతి నిరాకరణ.పరీక్ష కేంద్రంలో కి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదు. కంప్యూటర్‌పై ప్రత్యక్షమైన ప్రశ్నపత్రం తమ సబ్జెక్టు కు చెందినదిగా నిర్ధారించుకోవాలి. సబ్జెక్టు మారితే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లాలి. పరీక్షకేంద్రాలవద్ద సిసి కెమెరాలు అమర్చారు నిర్వాహకులు. ఇప్పటికే అన్ని పరీక్షాకేంద్రాలను సిద్ధం చేసారు.