Pawan Kalyan: జనసేన ‘వారాహి’ రిజిస్ట్రేషన్ వాయిదా
Pawan Kalyan: ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కొత్త వాహనాన్ని సమకూర్చుకున్న విషయం తెలిసిందే. వారాహి అనే పేరు గల ఈ వాహనం ఆర్మీ కలర్ లో ఉండడంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ రంగును ఆర్మీ తప్ప మరెవరూ కూడా వాడకూడదని నిబంధనలు ఉండడంతో వారాహి రిజిస్ట్రేషన్ వాయిదా పడింది.
లారీ ఛాసిస్ ను బస్సుగా మార్చడం, బస్సు అని చెప్పినప్పుడు బస్సు టైర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉండడంతో అధికారులు తిప్పిపంపారు. అంతేకాక, మైన్స్లో వాడాల్సిన వాహన టైర్లను రోడ్లపై వాడటం రూల్స్కు విరుద్ధమంటూ తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్ విభాగం సూచించింది. అంతేగాక ఆర్మీకి సంబంధించిన కలర్ను ఒక సివిల్ వాహనానికి ఉపయోగించకూడదని పేర్కొంది.
ఇవన్నీ మార్చుకుని వస్తేనే రిజిస్ట్రేషన్ చేయగలం అని ఆఫీసర్లు చెప్పడంతో పవన్ కల్యాణ్ ఆర్మీ కలర్ వాహనం రిజిస్ట్రేషన్ పెండింగ్లో ఉంది. కాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో యాత్ర చేసేందుకు వారాహి వాహనాన్ని రెడీ చేశారు. వారాహి వాహనంతో దిగిన ఫొటోను ఆయన ఇటీవల ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఇది క్షణాల్లోనే వైరల్ అయింది. అయితే వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాహనానికి ఉన్న కలర్పై పవన్ టార్గెట్గా విమర్శలు చేస్తూనే ఉన్నారు.