IT Raids : ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీపై ఐటీ దాడులు… 400 కోట్లు అక్రమార్జన
IT Raids on Divyasree Developers and Nuziveedu Seeds Companies : ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీపై ఐటీ దాడులు బెంగళూరుకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ దివ్యశ్రీపై ఐటీ ఆకస్మిక దాడులు జరిపింది. మరోవైపు హైదరాబాద్‌లోని నూజివీడు సీడ్స్ కంపెనీలోనూ ఐటీ సోదాలు చేసింది. అయితే దివ్యశ్రీ, నూజివీడు సీడ్స్ కంపెనీ మధ్య జాయింట్ లావాదేవీలు ఉన్నట్టుగా గుర్తించారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో ఉన్న ఇళ్ళు, ఆఫీస్ లతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 40 ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరిపారు. 15 రోజుల క్రితం సోదాలు చేసిన ఐటీ బెంగళూరు కేంద్రంగా నడుస్తోన్న దివ్య శ్రీ రియల్ ఎస్టేట్ కంపెనీ అనధికారికంగా 400 కోట్ల ఆదాయం సంపాదించినట్లు గుర్తించింది. సోదాల అనంతరం రూ. 90 కోట్ల ఆదాయాన్ని పక్కదారి పట్టిస్తున్నట్లు నిర్దారణకు వచ్చారు. నకిలీ సేల్స్‌తో సదరు కంపెనీలు భారీగా రుణాలు తీసుకున్నారు. ఇక సోదాల్లో రూ.3.5 కోట్ల నగదు, 18.50 కోట్ల బంగారం, సిల్వర్ ను సీజ్ చేశారు. నకిలీ ఇన్వాయిస్లతో రూ. 28 కోట్ల క్రయవిక్రయాలు జరిగినట్టుగా సోదాల్లో వెల్లడైంది. రెండు కంపెనీలు జాయింట్‌గా 3 పట్టణాల్లో వెంచర్లు వేసినట్టు సమాచారం.