IT raids in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో జోరుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు
IT raids in Several Real Estate companies in Telugu States
దర్యాప్తు సంస్థలు జోరు పెంచాయి. అక్రమ ఆర్ధిక లావాదేవీలు చేస్తున్న అనేక కంపెనీలపై ఫోకస్ పెంచాయి. జోరుగా దర్యాప్తు చేస్తున్నాయి. మనీ లాండరింగ్, హవాలా ఆరోపణల ఆధారంగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ క్యూ నెట్ లోను, ఆదిత్య హోమ్స్, సీఎస్కే హోమ్స్, ఊర్జిత ప్రాపర్టీస్, ఐరా రియల్ ఎస్టేట్ కంపెనీలలో సోదాలు నిర్వహిస్తున్నాయి.
మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ క్యూ నెట్ పై IT సోదాలు కొనసాగుతున్నాయి. క్యూ నెట్ కి అనుబంధంగా ఉన్న విహన్ డైరెక్ట్ సెల్లింగ్ సంస్థల్లో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. సైబరాబాద్ లో విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ సంస్థపై కేసు నమోదు అయింది.v దీంతో దర్యాప్తు సంస్థలు రంగంలో దిగాయి. హైదరాబాద్ తో పాటు ముంబై, బెంగళూరు, చెన్నైలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 6 బ్యాంకుల్లో 90 కోట్ల రూపాయల నగదు ఫ్రీజ్ ఈడి చేసింది.
మనీ లాండరింగ్, హవాలా ఆరోపణలపై సోదాలు ప్రారంభించిన దర్యాప్తు సంస్థలు అనేక అవకతవకలను రాబడుతున్నాయి.ఆదిత్య హోమ్స్, సీఎస్కే హోమ్స్, ఊర్జిత ప్రాపర్టీస్, ఐరా రియల్ ఎస్టేట్ కంపెనీలపై కూడా రెండో రోజు సోదాలు కొనసాగుతున్నాయి.
ఐటీ రిటర్న్స్ లో అవకతవకలను ఐటీ శాఖ గుర్తించింది. ఫ్లాట్ల అమ్మకాల పై ఐటీ శాఖ మరిన్ని వివరాలు రాబడుతోంది.ఐదు ఏళ్లుగా కంపెనీలు చేపట్టిన పలు ప్రాజెక్టు అమ్మకాల వివరాలను పూర్తిగా సేకరించే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను కూడా ఐటీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. బిల్డర్లకు బినామీలుగా ఉన్న వారి వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు.