IT Raids : హైదరాబాద్‌లో ఆగని ఐటీ సోదాలు
IT Raids: హైదరాబాద్‌లో ఐటీ సోదాలు ఆగడంలేదు. రాజకీయ నేతల పైనే కాకుండా పలు పారిశ్రామిక వేత్తలపై ఈ ఐటీ దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఒకేసారి 20 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్ కంపెనీలే లక్ష్యంగా ఈ దాడులు చేస్తున్నట్టు ఓ వర్గం పేర్కొంటుంది. దిల్‌సుఖ్‌నగర్‌లోని గూగి ప్రధాన కార్యాలయంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.
దిల్‌సుఖ్‌నగర్‌లోని గూగి ప్రాపర్టీస్ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఫార్మా హిల్స్, వండర్ సిటీ, రాయల్ సిటీతోపాటు పలు రియల్ ఎస్టేట్ కంపెనీలపై దాడులు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో నగరంలోని 20 చోట్ల అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గూగి రియల్ ఎస్టేట్ కంపెనీ యజమాని యాసిన్ ఫాతిమా అక్బర్ షేక్ ఇండ్లతో పాటు వారి బంధువుల ఇళ్లలో కూడా రైడ్స్ జరుగుతున్నటు సమాచారం. గతంలో ఎస్‌ఆర్ నగర్‌లోని వసుధ సంస్థ ప్రధానకార్యాలయంతోపాటు మాదాపూర్, జీడిమెట్లలోని రియల్ ఎస్టేట్ కంపెనీల్లో అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.