KTR: దిగ్విజయంగా ముగిసిన కేటీఆర్ దావోస్ పర్యటన
IT Minister KTR wraps up Davos tour
కేటీఆర్ దావోస్ పర్యటన దిగ్విజయంగా ముగిసింది. స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు జనవరి 16 నుంచి జనవరి 20 వరకు జరిగింది. ఈ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొన్న కేటీఆర్ బృందం అనేక ఒప్పందాలు చేసుకుంది. సదస్సు పూర్తయిన సందర్భాన్ని తెలియజేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దావోస్ పర్యటన విజయవంతం కావడానికి సహకరించిన జయేశ్ రంజన్ తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. దావోస్ తాము సాధించిన విజయాలను వివరించారు.
4 రోజుల్లో 52 సమావేశాల్లో పాల్గొన్నామని కేటీఆర్ తెలిపారు. అందులో 6 రౌండ్ టేబుల్ సమావేశాలు కాగా మరో రెండు ప్యానెల్ డిస్కషన్స్ ఉన్నాయని కేటీఆర్ ట్వీట్ చేయడం ద్వారా తెలిపారు. దావోస్ పర్యటన ద్వారా 21.000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు వస్తున్నట్లు, తద్వారా రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన జరగనున్న విషయాన్ని కూడా కేటీఆర్ వివరించారు.
కేటీఆర్ దావోస్ టూర్ ద్వారా సాధించిన విజయాలు
2 వేల కోట్ల రూపాయలతో ఇండియాలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ డేటా సెంటర్ ను తెలంగాణలో ఏర్పాటుచేస్తున్న భారతీ ఏయిర్ టెల్ గ్రూప్ ముందుకు వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా భారతీయ మార్కెట్ లో విస్తరిస్తామని ఫ్రాన్స్ కు చెందిన ప్రఖ్యాత ఔషధ పరిశోధన, తయారీ సంస్థ యూరోఫిన్స్ ప్రకటించింది. లండన్ తరువాత హైదరాబాద్‌లో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు అపోలో టైర్స్ ప్రకటించింది.
210 కోట్ల రూపాయల పెట్టుబడితో అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణలో మల్టీ గిగా వాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రం ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అదే విధంగా తెలంగాణలో తమ కంపెనీ కార్యకలాపాలను రెట్టింపు చేస్తున్నట్లు పెప్సికో కంపెనీ ప్రకటించింది.
రీహాబిలిటేషన్ థెరపీలో రోగులు, వైద్య సంస్థలకు అవసరమయ్యే డిజిటల్ సేవలను అందించే వెబ్ పీటీ, 150 కోట్లతో హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్ కూడా ఏర్పాటు కానుంది.
All thanks to my wonderful Team led ably by @jayesh_ranjan Garu 👏 https://t.co/uA6V2yY0S7
— KTR (@KTRTRS) January 21, 2023