కర్ణాటక ఎన్నికలు దేశంలో పెను మార్పులు తెచ్చిపెట్టేవిధంగా మారుతున్నాయి. ఈ మార్పు కర్ణాటకలో ఎన్నికల సమయంలో వచ్చింది కాదు. గతేడాది సెప్టెంట్ 7వ తేదీనే మార్పుకు నుడికారం వేశారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఉన్నప్పటికీ దానిని కాదని కేవలం కాంగ్రెస్ పార్టీ పునర్జీవనం కోసమే రాహుల్ గాంధీ ప్రయత్నించడం మొదలుపెట్టాడు.
Congress Party: కర్ణాటక ఎన్నికలు దేశంలో పెను మార్పులు తెచ్చిపెట్టేవిధంగా మారుతున్నాయి. ఈ మార్పు కర్ణాటకలో ఎన్నికల సమయంలో వచ్చింది కాదు. గతేడాది సెప్టెంట్ 7వ తేదీనే మార్పుకు నుడికారం వేశారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఉన్నప్పటికీ దానిని కాదని కేవలం కాంగ్రెస్ పార్టీ పునర్జీవనం కోసమే రాహుల్ గాంధీ ప్రయత్నించడం మొదలుపెట్టాడు. దీనికి వేసిన బీజమే భారత్ జోడో యాత్ర. తమిళనాడులోని కన్యాకుమారి నుండి ప్రారంభమైంది. 150 రోజులపాటు 4 వేల కిలోమీటర్లకు పైగా రాహుల్ గాంధీ పాదయాత్ర కోనసాగింది. వివిధ రాష్ట్రాల గుండా ఈ యాత్ర కోనసాగింది. తమిళనాడు, కేరళ మీదుగా కర్ణాటకలోకి ప్రవేశించిన యాత్రకు ఆ రాష్ట్రప్రజల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభించింది.
విడివిడిగా ఉన్న నేతలు ఈ యాత్రతో ఏకమయ్యారు. కాంగ్రెస్లో అంతర్గత కలహాలకు చెక్ పెట్టారు. డీకె శివకుమార్, సిద్దరామయ్యల మధ్య ఉన్న పొరపొచ్చాలను పక్కనపెట్టి ఒక్కటిగా చేతులు కలిపి యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్ర విజయం వంతం కావడానికి వారివంతు కృషి చేశారు. భారత్ జోడో యాత్రకు కర్ణాటకలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడి నుండి తెలంగాణలోకి ఈ యాత్ర ప్రవేశించింది. హైదరాబాద్లో జరిగిన ఈ పాదయాత్ర సూపర్ సక్సెస్ కావడంతో పార్టీ నేతలు ఉత్సాహంతో ఉన్నారు.
ఇదే ఊపును కంటిన్యూ చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలపై పోరాటం చేస్తున్నారు. పేపర్ లీకేజీ కేసుపై ఫైట్ చేస్తున్నారు. అంతేకాదు, ఇచ్చిన హామీలను పక్కనపెట్టి పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టడం, ప్రజాధనంలో చేపట్టిన భవనాలలోకి పార్టీ నేతలను, ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు ప్రవేశం లేదని అడ్డుకోవడం పెద్ద దుమారానికి దారితీసింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలోకి వెళ్లేందుకు అనుమతులు లేవని రేవంత్ రెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. పరిపాలన భవాన్ని పార్టీ కార్యాలయంగా మారుస్తున్నారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ పాదయాత్ర చురుగ్గా సాగుతున్నది. మధ్యలో గ్యాప్ వచ్చిన సమయంలో ప్రజాపోరాటాల్లో పాల్గొంటున్నారు. ప్రజల్లో భరోసా కల్పించేందుకు ఇటీవల ప్రియాంక గాంధీ హైదరాబాద్లో జరిగిన యువ సంఘర్షణ సభలో పాల్గొన్నారు. యూత్ డిక్లరేషన్ను రిలీజ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత డిక్లరేషన్ను అమలు చేసి తీరుతామని ప్రకటించారు. మొన్నటి వరకు బీజేపీ ఒక్కటే గట్టిపోటీ అనుకున్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ పడిలేచే తరంగంలా ఉంటుండటంతో మిగతా పార్టీలు అలర్ట్ అవుతున్నాయి.
ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ పార్టీ చూస్తున్నది. అయితే, ఎలాగైనా అడ్డుకొని తీరుతామని కాంగ్రెస్, బీజేపీ చెబుతున్నాయి. ఈ ఏడాది తెలంగాణలో జరిగే ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఇక ఇదిలా ఉంటే, ఈ ఏడాది మద్యప్రదేశ్, రాజస్థాన్ వంటి పెద్ద రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఎలాగైనా రాజస్థాన్లో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ చూస్తున్నది. అయితే, ఈ రాష్ట్రంలోనూ ఓ సంప్రదాయం కొనసాగుతున్నది. ఒకసారి ఒక పార్టీకి పట్టంగడితే, మరోసారి మరో పార్టీకి పట్టంగడతారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా, ఈసారి తమదే విజయమని బీజేపీ చెబుతున్నది. మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, జ్యోతిరాధిత్య సింధియా తిరుగుబాటు చేయడంతో ఆ పార్టీ కూలిపోయింది. దీంతో అక్కడ బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకున్నది. ఈ ఏడాది ఈ రెండు రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరుగుతుండటంతో మరింత ఆసక్తి నెలకొన్నది. కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నదా లేదంటే సంప్రదాయాలకే ప్రజలు మొగ్గుచూపుతున్నారా అన్నది ఈ ఏడాది చివరినాటికి తేలిపోతుంది.