Sajjanar: క్యూ నెట్ పాత్రపై సమగ్ర విచారణ జరగాలి – సజ్జనార్
IPS officer Sajjanar asks investigating agencies to Focus on Q Net frauds
సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఈ దుర్ఘటనలో విచారణ జరుపుతున్న పోలీసులకు క్యూ నెట్ సంస్థ గురించి వివరాలు తెలిశాయి. ఈ సంస్థకు చెందిన ఐదుగురు మహిళలు అగ్ని ప్రమాదంలో మరణించినట్లు పోలీసులు గుర్తించారు.
క్యూ-నెట్ సంస్థపై ఇప్పటికే మనీలాండరింగ్‌తో పాటు ఇతర కేసులు ఈడీ నమోదు చేసింది. గతంలో దేశంలోని పలు నగరాల్లో క్యూ-నెట్ కార్యాలయాలపై దాడులు కూడా చేసింది. కానీ, సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని క్యూ-నెట్ బ్రాంచ్ ఉన్నట్లు తెలియకపోవడంతో వారిపై దాడి చేయడం ఈడీకి కుదరలేదు. తాజాగా అగ్నిప్రమాదం కారణంగా స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని బీ-బ్లాక్ ఫ్లాట్ నెంబర్ 510, 511లో క్యూనెట్ కార్యాలయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ విషయాలను పూర్తిగా పరిశీలించిన ఐపీఎస్ అధికారి సజ్జనార్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనలో దుర్మార్గపు సంస్థ క్యూ నెట్ పాత్రపై సమగ్ర విచారణ జరగాలని సజ్జనార్ కోరారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి.. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. మోసపూరిత సంస్థల కదలికలపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు నిఘా పెట్టాలని సూచించారు. పలు పత్రికల్లో వచ్చిన కథనాలను ట్విట్టర్ ద్వారా సజ్జనార్ షేర్ చేశారు.
స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరగడం బాధాకరం. ఈ దుర్ఘటనలో మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఆరుగురు యువతీయువకులు మృతి చెందడం కలిచివేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. వారి కుటుంబసభ్యులకు ఎల్లవేలలా అండగా నిలుస్తాం. 2/6 pic.twitter.com/hEM9M0FooU
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 18, 2023
భారీ డబ్బును ఆశచూపి అమాయకులను మోసం చేస్తోన్న క్యూనెట్ బాగోతం ఈ అగ్నిప్రమాదంతో మరోసారి బయటపడింది. క్యూనెట్ అమాయకులైన ఆరుగురిని పొట్టనబెట్టుకుంది. ఆ కాంప్లెక్స్‌లో బీఎం5 సంస్థ పేరిట కాల్ సెంటర్ నిర్వహిస్తూ తెరవెనక క్యూనెట్ ఎంఎల్‌ఎం దందా సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 3/6 pic.twitter.com/hN6AXcWZvy
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 18, 2023
యువతీయువకుల్లారా! అధిక డబ్బుకు ఆశపడి క్యూనెట్ లాంటి మోసపూరిత ఎంఎల్‌ఎం సంస్థల మాయలో పడకండి. మీ బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోకండి. ఎంఎల్‌ఎం సంస్థలు అరచేతిలో వైకుఠం చూపిస్తూ యువతను ఆకర్శిస్తూ బుట్టలో వేసుకుంటున్నాయి. జాగ్రత్తగా ఉండండి. 5/6 pic.twitter.com/dH5MTYvS66
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 18, 2023
మోసపూరిత సంస్థల విషయంలో భవన యాజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సంస్థ మోసపూరితమైందా? కాదా? అని ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకుని అద్దెకి ఇవ్వాలి. భవన యజమానులు అధిక అద్దెకు ఆశపడి.. ఇలాంటి మోసాలకు బాధ్యులు కావొద్దు. 6/6 pic.twitter.com/i3uly8WkAO
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 18, 2023
..