Interactive Science Park: సరికొత్త హంగులతో ఇంటరాక్టివ్ సైన్స్ పార్క్..త్వరలో మంత్రి కేటీఆర్ చే ప్రారంభం
Interactive Science Park: హైదరాబాద్ రోజురోజుకు సరికొత్తగా తన స్వభావాన్ని మార్చుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటినుండి అభివృద్ధిబాటలో పయనిస్తుంది. ఇప్పటికే ఎన్నో ఐటీ పార్కులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వం మరో సైన్స్ పార్క్ ఏరాటుకు సిద్దమైనది. హైటెక్ సిటీలో సరికొత్త హంగులతో ఇంటరాక్టివ్ సైన్స్ పార్క్ ఏర్పాటు చేయబోతుంది. సందర్శకుల కోసం పార్క్‌లో కేఫ్ ఏర్పాటు చేస్తున్నారు. సరికొత్త థీమ్‌తో ఏర్పాటు చేస్తున్న ఈ సైన్స్ పార్క్ సందర్శకులకు మంచి అనుభూతిని అందించనుందని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు.
సైబర్ టవర్స్ సమీపంలో దాదాపు 3 ఎకరాల విస్తీర్ణంలో ఇంటరాక్టివ్ సైన్స్ పార్కు త్వరలోనే అందుబాటులోకి రానున్నది. ఇక్కడ ల్యాప్‌టాప్‌తో పనిచేసుకునేందుకు వీలుగా కూర్చునే సీటు, వైఫై సౌకర్యం, చార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ త్వరలోనే ఈ పార్కును ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు. చిన్న పిల్లలకు ప్రత్యేక ప్లే గ్రౌండ్‌తో పాటు ఓపెన్ జిమ్ అందుబాటులో ఉంచనున్నారు. ఇక సీనియర్ సిటిజన్లు, విగలాంగుల కోసం ర్యాంప్‌లు, వాకింగ్ కోసం ట్రాక్, సీటింగ్ ఏర్పాట్లు, వాష్‌రూమ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇక ఫ్రీ వైఫై ఇస్తుండటంతో యువత ఈ పార్క్‌కు అధికంగా వచ్చే చాన్స్ ఉందని పేర్కొంటున్నారు అధికారులు. నగరవాసులకు ఈ పార్కులోకి టికెట్ తో అనుమతిస్తారా? లేదా ఉచితంగానే ప్రవేశం కల్పిస్తారా అనేది మరికొద్దిరోజుల్లో తేలనుంది.