Sathivik Suicide: హైదరాబాద్ లో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య, క్లాస్ రూంలోనే సుసైడ్
Inter Student Sathvik Suicide in the Class room in Hyderabad College
హైదరాబాద్ నగరంలో మరో విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. నార్సింగ్ ప్రాంతంలో సాత్విక్ అనే ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధి సుసైడ్ చేసుకున్నాడు. క్లాస్ రూంలోనే ఉరి వేసుకుని సాత్విక్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒత్తిడి కారణంగానే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడని సహ విద్యార్ధులు చెబుతున్నారు. ఆసుపత్రికి తరలించేందుకు సైతం యాజమాన్యం ముందుకు రాలేదని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో ఓ బైకర్‌ను లిఫ్ట్ అడిగి స్నేహితులు ఆసుపత్రికి తరలించారు.
సాత్విక్ తల్లిదండ్రుల ఆందోళన
సాత్విక్ తల్లిదండ్రులు, బంధువులు కాలేజీ వద్దకు చేరుకున్నారు. సాత్విక్ మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే సాత్విక్ బలవన్మరణానికి పాల్పడ్డాడని సాత్విక్ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్ధులతో కలిసి ఆందోళకు దిగారు. కొన్ని విద్యార్ధి సంఘాలు కూడా సాత్విక్ తల్లిదండ్రులకు అండగా నిలిచారు. మరోవైపు సాత్విక్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
పరారీలో కాలేజీ హాస్టల్ వార్డెన్
నార్సింగ్ లోని సాత్విక్ మరణించిన కాలేజీలో హాస్టల్ వార్డెన్ ఎంతో దురుసుగా ప్రవరిస్తున్నాడని, విద్యార్ధులను ఎంతో ఇబ్బందులకు గురిచేస్తున్నాడని విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా పరిణామాలతో హాస్టల్ వార్డెడ్ భయపడి పారిపోయాడు. పరారీ అయ్యాడు.
కేసు నమోదు
చైతన్య కాలేజీ ఇంటర్ విద్యార్థి సాత్విక్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాలేజీ సిబ్బంది కృష్ణారెడ్డి, ఆచార్య, హాస్టల్ వార్డెన్ నరేష్ పేర్లను FIR లో చేర్చారు. సాత్విక్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలో దిగిన పోలీసులు సెక్షన్ 305 కింద కేసు నమోదు అయింది.
Even knowing that #Satwik committed suicide, the #SriChaitanya college staff at least, not taken to the hospital, fellow students asked a vehicle for a lift and took Satwik to the hospital.
Parents, Students protests demands punishment to management. (2/3) #Hyderabad #Narsingi pic.twitter.com/kBH2THYoq6— Surya Reddy (@jsuryareddy) March 1, 2023
A 1st year intermediate #student Satvik of #SriChaitanya Junior College, allegedly committed suicide by hanging himself in his classroom at #Narsingi in #Hyderabad, due to alleged stress, harassment, abusing, beating by teacher Acharya. (1/3)#SriChaitanyaCollege #Telangana pic.twitter.com/kXpjaEH2Ze
— Surya Reddy (@jsuryareddy) March 1, 2023