Team India: జూనియర్ ఎన్టీఆర్ ను కలిసిన భారత క్రికెటర్లు, ఎవరి ఇంట్లో కలిశారో తెలుసా?
Indian Cricketers met Jr. NTR in Hyderabad
హైదరాబాద్ నగరం మరింత సందడిగా మారుతోంది. భారత క్రికెటర్లు నగరంలో అడుగుపెట్టడంతో కోలాహలం మొదలయింది. ఈ రోజు మధ్యాహ్నం ఉప్పల్ స్టేడియంలో భారత్, కివీస్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయనున్నారు. ఈలోగా భారత జట్టులోకి ప్రముఖ ఆటగాళ్లు కొందరు జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారు. కలిసి ఫోటోలు దిగారు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ అభిమానులు తన ట్విట్టర్ ఖాతాలతో ఈ ఫోటోలను ట్వీట్ చేస్తున్నారు.
సూర్యకుమార్ యాదవ్, యజువేంద్ర చాహల్, శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, శార్ధుల్ ఠాకుర్ తదితరులు ఎన్టీఆర్ తో ఫోటో దిగిన వారిలో ఉన్నారు. గతంలో ఖరీదైన కార్స్ కలెక్షన్స్ తో హైదరాబాద్ వాసి నజీర్ ఖాన్ దేశ వ్యాప్తంగా చాలా మందిని ఆకట్టుకున్నాడు. వారిలో కొందరు టీమిండియా సభ్యులు కూడా ఉన్నారు. అప్పటి నుంచి నజీర్ ఖాన్ తో వారు టచ్ లో ఉన్నారు. నిన్న రాత్రి నజీర్ ఖాన్ ఇంటికి ఎన్టీఆర్ రావడం, అదే సమయంలో టీమిండియా ప్లేయర్లు రావడం జరిగింది. ఒకేసారి వీరందరూ కలవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.
ఇటీవలే నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగింది. రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి స్టెప్పులు వేసిన నాటు నాటు సాంగ్ దేశ వ్యాప్తంగా ఎందరితోనో స్టెప్పులు వేయించింది.
రేపటి నుంచి వన్డే సిరీస్
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ రేపటి నుంచి మొదలు కానుంది. తొలి వన్డే మ్యాచ్ హైదరాబాద్ లో జనవరి 18న జరగనుండగా, రెండో వన్డే మ్యాచ్ రాయ్ పుర్ లో జనవరి 21న జరగనుంది. వన్డే సిరీస్ లో చివరిదైన మూడో మ్యాచ్ జనవరి 24న ఇండోర్ లో జరగనుంది. ఈ మ్యాచులన్నీ భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 1.30కు ప్రారంభం కానున్నాయి.
ఇక టీ 20 మ్యాచుల విషయానికి వస్తే తొలి టీ 20 మ్యాచ్ జనవరి 27న రాంఛీలో జరగనుంది. రెండో టీ 20 మ్యాచ్ జనవరి 29న లక్నోలోను, మూడో మ్యాచ్ ఫిబ్రవరి 1న అహ్మదాబాద్ లోను జరగనుంది.
Hero @tarak9999 with Indian Cricket Team Players @surya_14kumar @ishankishan51 @yuzi_chahal @imShard @ShubmanGill !!#ManOfMasessNTR pic.twitter.com/AvMLEMarZV
— Nandipati Murali (@NtrMurali9999) January 16, 2023
Hero @tarak9999 with Indian Cricket Team 🔥🔥@surya_14kumar @ishankishan51 @yuzi_chahal @imShard @ShubmanGill #NTR30 #ManOfMassesNTR pic.twitter.com/I03vZHlEZW
— NTR Fans Campaign (@NFC__Mass) January 17, 2023