కరోనా తరువాత ఉద్యోగులందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కి మారిపోతున్నారు. ఈ క్రమంలో బదిలీలు, కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారు, ప్రాజెక్ట్ వర్క్ కోసం ఇతర పట్టణాలకు వెళ్లేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వీరందరిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు కో లివింగ్ కేంద్రాలు పెరుగుతున్నాయి. హాస్టల్స్, పేయింగ్ గెస్ట్‌ల కు తర్వాతి రూపమే ఈ కో లివింగ్ కేంద్రాలు.
Co- living: కరోనా తరువాత ఉద్యోగులందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కి మారిపోతున్నారు. ఈ క్రమంలో బదిలీలు, కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారు, ప్రాజెక్ట్ వర్క్ కోసం ఇతర పట్టణాలకు వెళ్లేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వీరందరిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు కో లివింగ్ కేంద్రాలు పెరుగుతున్నాయి. హాస్టల్స్, పేయింగ్ గెస్ట్‌ల కు తర్వాతి రూపమే ఈ కో లివింగ్ కేంద్రాలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు 20 నుండి 30 వరకు కో లివింగ్ కేంద్రాలున్నాయి. ఒక్కో లివింగ్ సెంటర్లో దాదాపు 300 మంది నివసించే అవకాశముంటుంది. కో లివింగ్ కేంద్రాలు ఎక్కువగా పాశ్చాత్య దేశాలలో ఉండేవి అవి ప్రస్తుతం భారతదేశానికి పాకింది. మొదట్లో గతంలో కో లివింగ్ కేంద్రాలు బెంగళూరులో నెలకొన్నాయి. ఆతర్వాత ఇండియాలో పలు చోట్ల విస్తరించాయి. తాజాగా కో లివింగ్ కేంద్రాలకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఇటీవల హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధితో ఇక్కడ కూడా కో లివింగ్ బిజినెస్ బాగా పెరిగింది. హాస్టల్స్ లాగా ఒకే రూమ్‌కి పరిమితం అవడం, లేదా పెయిడ్ గెస్ట్ కేంద్రాల్లోలాగా నిబంధనలు మరీ కఠినంగా ఉండకపోవడం కో లివింగ్ ప్రత్యేకత.
సాధారణంగా సింగిల్ బెడ్ రూమ్ అద్దెకు తీసుకోవాలంటే కనీసం 15 వేల రూపాయలకు పైగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ కో లివింగ్‌లో షేరింగ్ లో రూ.7 వేల ఖర్చుతో అంతకంటే ఎక్కువ సౌకర్యాలను పొందవచ్చు. అందుకే ఇప్పుడు ఈ కో లివింగ్ కేంద్రలపై యువత ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. మనకు నచ్చినన్ని రోజులు ఉండొచ్చు, లేదంటే వేరే చోటుకు వెళ్ళవచ్చు. బెంగళూరు, హైదరాబాద్, పుణెలో,కలకత్తా, ముంబై వంటి నగరాలు కో లివింగ్ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి కో లివింగ్ లలో హైదరాబాద్‌లో మొదటి స్థానంలో ఉండేలా కనిపిస్తుంది. హైదరాబాద్ లో మరో వెయ్యి పడకలతో కో లివింగ్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. బంజారాహిల్స్,మణికొండ , మాదాపూర్, గచ్చిబౌలి,కొండాపూర్ ఐటీ హబ్‌ల చుట్టూ ఈ కో లివింగ్ కేంద్రాలు ఉన్నాయి. కొవిడ్ కారణంగా వీటికి సడన్‌గా డిమాండ్ తగ్గిపోయింది. తిరిగి ఇప్పుడు పరిస్థితులు మారడంతో ఈ కో లివింగ్ కేంద్రాలకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది.
ఈ కో లివింగ్ కేంద్రంలో ఆగ, మగ ఇలా ఎవరైనా వారికీ నచ్చినట్టు ఉంటారు. ఎవరిపని వారిదే. అయితే యంగ్ టెకీలు మాత్రం హాస్టళ్ళు, అద్దెగదుల కోసం వెతుకులాట మానేసి.. కో లివింగ్ రూమ్స్ నే ఎక్కువగా ఇష్టపడుతున్నారని నిర్వాహకులు తెలుపుతున్నారు. కో-లివింగ్ అనేది రెసిడెన్షియల్ కమ్యూనిటీ లివింగ్ మోడల్ లా ఉంటాయి కాబట్టి వీటికి యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. అంటే ఒకే రకం అభిరుచి, అలవాట్లు ఉన్న వ్యక్తులు రూమ్ ను షేర్ చేసుకుంటారు. దీంతో కో-లివింగ్ స్పేస్ ల కోసం డిమాండ్ పెరుగుతోంది. బెంగళూరుకు చెందిన ఓ సంస్థ హైదరాబాద్ లో300 పడకలతో కూడిన కో-లివింగ్ స్పేస్ లను నిర్వహిస్తోంది. నెలకు ఒక్కోబెడ్ కు 10 వేల నుంచీ 15వేల వరకు వసూలు చేస్తోంది. కో-లివింగ్ ఇన్ ఇండియా లో 2021 చివరి నాటికి 2.1 లక్షల కో-లివింగ్ స్పేస్ లు ఉంటే 2025కు అది 5.5 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.
సహజీవనం అనేది ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఐటీ కారిడార్ లో ఎక్కువగా కో లివింగ్ కేంద్రాలుఉండడంవల్ల సహజీవనం చేసేవారు ఎక్కువగా ఈ కో లివింగ్ కేంద్రాలవైపు మొగ్గు చూపుతున్నారు. మ్యారేజ్ ఫిక్స్ అయినవారు. ప్రేమించుకుని పెళ్లిచేసుకునే జంటలు ఇద్దరు ఉద్యోగులుకావడంతో ఇటువంటి రూమ్స్ కు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. అంతేకాదు నిర్వాహకులు మంచి మంచి వసతులను కూడా ఏర్పాటు చేస్తుండడంతో ఎక్కువగా వీటికి ఎక్కువగా డిమాండ్ పెరుగుతుంది. ఈ కో లివింగ్స్ రూమ్స్ ఐటీ పరిసరప్రాంతాల్లో ఉండడంతో ఉద్యోగులకు కూడా ఎక్కువ ప్రయాణించే సమయం తగ్గుతుంది. అలాగే ట్రాఫిక్ సమస్య ఉండదు. ఐదు,పదినిమిషాల్లో నేరుగా ఆఫీస్ కు వెళ్లే సదుపాయం ఉండడంతో ఎక్కువగా ఈ కేంద్రాలపై మక్కువ చూపిస్తున్నారు.