HomeHyderabadIncome Tax Department Officers Raids On Vamsi Ram Builders House
Published Date - 10:44 AM, Tue - 6 December 22
IT Raids: సుబ్బారెడ్డి ఇంట్లో కొనసాగుతున్న సోదాలు
IT Raids: సుబ్బారెడ్డి ఇంట్లో కొనసాగుతున్న సోదాలు
IT Raids on Vamsiram Builders: వంశీరామ్ బిల్డర్ సుబ్బారెడ్డి ఇంట్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. సుమారు 10 మంది అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సుబ్బారెడ్డి ఇంట్లోకి ఎవర్ని వెళ్ళనివ్వకుండా లాకులు వేసి సోదాలు చేస్తున్నారు. సుబ్బారెడ్డి తో పాటు ఆయన బావమరిది జనార్ధన్ రెడ్డి ఇంట్లోనూ, వారి కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. విజయవాడలోని దేవినేని అవినాష్ ఇంటిపై కూడా ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. ఉదయం 6:30 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ పక్కన దేవినేని అవినాష్ కు ఉన్న స్థలాన్ని వంశీ రామ్ బిల్డర్స్ డెవలప్మెంట్ కోసం తీసుకున్నది. ఈ స్థలంలో 40 శాతం వరకు అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ల్యాండ్ డెవలప్‌మెంట్ కు సంబంధించిన నిధుల విషయంపైన, బిల్డర్ సుబ్బారెడ్డికి, అవినాష్ కు ఉన్న సంబంధాలపై కూడా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.