IMD warning on Heat Waves: మార్చి నుంచే వడగాల్పులు… రానున్న మూడు నెలలు
IMD warning on Heat Waves: ఫిబ్రవరి నెల నుండే ఎండలు మండుతున్నాయి. ఫిబ్రవరి మూడో వారంలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఫిబ్రవరి నెలలో ఉష్ణోగ్రతలు పెరిగాయి, మార్చి నెలలో ఆ ఉష్ణోగ్రతలు మరింత అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలియజేసింది. రాబోయే మూడు నెలలు ఎండలు మండిపోయే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ఎండలతో పాటు వడగాల్పులు ఉదృతంగా ఉండే అవకాశాలున్నట్లు తెలియజేసింది. వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతేనే తప్పించి బయటకు రావొద్దని తెలియజేసింది.
ఉత్తర మధ్య కోస్తాల్లో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలియజేసింది. ఇక మధ్య, వాయువ్య తూర్పు ఈశాన్యంలోనూ ఎండలు పెరుగుతున్నట్లు వాతావరణ శాఖాదికారులు తెలియజేశారు. మే నెలాఖరు వరకు ఇలాంటి పరిస్థితులు తప్పవని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించింది. ఉత్తరాదితో పాటు తెలుగురాష్ట్రాల్లో కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సాధారణం కంటే మూడు నుండి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ అధికారులు స్పష్టం చేశారు.