గత రెండు రోజులపాటు వాతావరణం కొంత చల్లగా మారినా, రోహిణి కార్తె ప్రారంభం కావడంతో మరలా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయ. వాతావరణంలో వేడి మొదలుకావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే మూడు రోజులపాటు వాతావరణంలో మార్పులు వస్తాయని, ఎండలు మండిపోయే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
Weather: గత రెండు రోజులపాటు వాతావరణం కొంత చల్లగా మారినా, రోహిణి కార్తె ప్రారంభం కావడంతో మరలా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయ. వాతావరణంలో వేడి మొదలుకావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే మూడు రోజులపాటు వాతావరణంలో మార్పులు వస్తాయని, ఎండలు మండిపోయే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని తెలియజేసింది. శని, ఆది, సోమవారాల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేసింది. ఇక, జూన్ 1 నుంచి ఐదు రోజులపాటు కూడా ఉష్ణోగ్రతలు అధికమొత్తంలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. పశ్చిమ, వాయువ్య ప్రాంతాల నుంచి వేడి గాలులు వీస్తుండటమే ఇందుకు కారణమని ఐఎండీ తెలియజేసింది.
జూన్ 2,3 తేదీల్లో కేరళ రాష్ట్రాన్ని రుతుపవనాలు తాకే అవకాశం ఉండగా, జూన్ 6వ తేదీ వరకు రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రాన్ని పలకరించనున్నాయని ఐఎండీ తెలియజేసింది. రుతుపవనాల రాక తరువాత వాతావరణంలో మార్పులు వస్తాయి. ఈ ఏడాది వర్షాలు సాధారణంగానే ఉన్నప్పటికీ, ఎండలు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, ప్రపంచంలో ఎల్‌నిలో పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంకట పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. కర్భన ఉద్గారాలు పెరిగిపోతుండటంతో భూతాపం పెరుగుతున్నది. తేమశాతం తగ్గిపోతే ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే కర్బన ఉద్గారాలను తగ్గించుకునేందుకు ప్రయత్నించాలని హెచ్చరిస్తున్నారు. ఏసీల వాడకం కొంతమేర తగ్గించాలని పిలుపునిస్తున్నారు. ప్రజాజీవనం మెరుగవ్వడంతో లగ్జరీకోసం ప్రజలు పరుగులు తీస్తున్నారు. ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, ఒక ఇంట్లో మూడునాలుగు వాహనాలు వాడుతుండటంతో కర్భన పదార్ధాలు భారీగా వాతావరణంలోకి విడుదల అవుతున్నాయి. వీటిపై ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావలసిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.