IMD Alert on Rains: ఎల్లో అలర్ట్… మరో నాలుగు రోజులు వర్షాలు
IMD Alert on Rains: తెలంగాణకు కేంద్ర వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలియజేసింది. నాలుగురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. దక్షిణ తమిళనాడు నుండి ఉత్తర కొంకణ్ వరకు ద్రోణి ఏర్పడినట్లు వాతావరణశాఖాధికారులు తెలియజేశారు. దీని కారణంగా తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవనున్నాయి.
ఇక, గత రెండు రోజులుగా రాష్ట్రంలో వర్షాలతో పాటు వడగండ్ల వాన కురుస్తున్నది. దీంతో పలు ప్రాంతాల్లో చిన్న చిన్న జంతువులు మృతి చెందాయి. పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. వికారాబాద్‌లో ఒక్కసారిగా గుట్టగుట్టలుగా వడగండ్లు కురవడంతో ప్రజలు షాక్ అయ్యారు. కాశ్మీర్‌లో ఉన్నామా, తెలంగాణలో ఉన్నామా అనే అనుమానాలు కలిగాయని ప్రజలు చెప్పుకొచ్చారు.