Cat Kidnap Case: పోలీసుల చెంతకు కనపడకుండా పోయిన పిల్లి
Cat Kidnap Case:హైదరాబాద్ లో అరుదైన జాతి పిల్లి అది. గత ఆదివారం వారి పిల్లి తప్పిపోయింది. ఇంటి తలుపులు తీసి ఉండటంతో.. అది బయటకు వెళ్లింది. అస్సలు తిరిగి రాలేదు. ఇక ఆ కుటుంబం తట్టుకోలేకపోయింది. ఎంత వెతికినా కనిపించలేదు. ఈ విషయాన్ని సోషల్ మీడియా లోనూ చెప్పారు. ఎవరికైనా కనిపిస్తే.. తెచ్చి ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. అలాగే వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసాడు. ఈ పిల్లి గురించి వాకబు చేసిన పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా..పిల్లిని ఒక అపరిచిత వ్యక్తి తీసుకెళ్లినట్లు రికార్డ్ అయింది.
ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. తాజాగా పిల్లిని తీసుకుపోయిన వ్యక్తి సదరు పిల్లి ని పోలీసులకు అందచేసాడు. పోలీసులు పిల్లిని యజమానికి అప్పగించారు. అయితే ఆ పిల్లి దారితప్పి ఇబ్బంది పడుతుండగా దానిని రక్షించడానికే తాను ఆ పిల్లిని తీసుకెళ్లానని.. ఈ వార్త వైరల్ కావడంతో దాని ఆచూకి తెలిసి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారని పిల్లిని తీసుకెళ్లిన వ్యక్తి చెప్తున్నారు.18 నెలల వయసు ఉన్న ఆ పిల్లి పేరు నోమ.. పిల్లి కళ్లలో ఒకటి డైమండ్ కలర్, మరొకటి రెడిష్ గ్రే రంగుల్లో ఉండటం దీని ప్రత్యేకత.