Hyderabad: మందు బాబులకు బ్యాడ్ న్యూస్
Hyderabad: మందు బాబులకు బ్యాడ్ న్యూస్. హోలీ సందర్భంగా హైదరాబాద్ పరిధిలో రెండు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్ కాబోతున్నాయి. మిగతా అన్ని కమిషనరేట్ ల గురించి ఇంకా క్లారిటీ లేదు కానీ ప్రస్తుతానికి రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నాము అంటూ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. మార్చి 6వ తేదీ సాయంత్రం 6:00 నుంచి 8వ తేదీ ఉదయం 6 గంటల వరకు షాపులు బార్లు వంటి వాటిని మూసి వేయబోతున్నాం అంటూ రాచకొండ పోలీస్ కమిషనర్ చౌహన్ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా షాపులు మూసివేయాలని వైన్ షాప్ నిర్వాహకులను ఆదేశించామని తెలిపారు. మందు తాగి బహిరంగ సందేశాల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. సాధారణంగా ప్రతి హోలీ పండుగకు మాత్రమే కాదు బోనాలు సమయంలో కూడా హైదరాబాద్ వ్యాప్తంగా వైన్ షాపులు మూసివేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఏడాది కూడా అదే విధంగా నిర్ణయం తీసుకున్నారు.