సీఎం కేసీఆర్ (CM KCR), మంత్రి కేటీఆర్(Minister KTR) ఐటీ పరిశ్రమపైన తొలి నుంచి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. దీనివల్ల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ నగరం ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. సిలికాన్‌వ్యాలీగా, ఐటీ క్యాపిటల్‌గా ప్రసిద్ధిగాంచిన బెంగళూరును మించిపోయేలా తెలంగాణ ఐటీ రంగం దూసుకెళ్తోంది.
IT : ప్రస్తుతం ప్రపంచం చూపు హైదరాబాద్(Hyderabad) వైపు మళ్లుతోంది. ఐటీ(IT)గా హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. దాదాపు 1,500 ఐటీ, ఐటీఈఎస్(IT, ITES) కంపెనీలకు హైదరాబాద్ చిరునామాగా నిలిచింది. ఐటీ ఉద్యోగుల సంఖ్య 3.60 లక్షల నుంచి 9.05 లక్షలకు మందికి చేరింది. 2014లో ఐటీ ఎగుమతుల విలువ రూ.57,258 కోట్లు ఉంటే, 2022-23 నాటికి రూ.2,41,275 కోట్లకు విస్తరించింది. గత సంవత్సరంతో పోల్చితే ఎగుమతులలో 31.44 % వృద్ధి సాధించింది.
సీఎం కేసీఆర్ (CM KCR), మంత్రి కేటీఆర్(Minister KTR) ఐటీ పరిశ్రమపైన తొలి నుంచి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. దీనివల్ల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ నగరం ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. సిలికాన్‌వ్యాలీగా, ఐటీ క్యాపిటల్‌గా ప్రసిద్ధిగాంచిన బెంగళూరును మించిపోయేలా తెలంగాణ ఐటీ రంగం దూసుకెళ్తోంది.
యాపిల్, అమెజాన్, సేల్స్‌ఫోర్స్, ఉబర్, మైక్రాన్, స్టేట్‌స్ట్రీట్, డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్(Development Bank of Singapore), ఫియట్క్రిస్లర్(FiatChrysler), మాస్‌మ్యూచువల్, ఇంటెల్, ప్రొవిడెన్స్, గోల్డ్మ్యాన్సాచ్స్, జెడ్ఎఫ్, యూబీఎస్, పెప్సి వంటి కంపెనీలను ఆకర్షించడంతోపాటు ఫేస్బుక్, క్వాలామ్, అక్సెంచర్, వేల్స్ఫార్గో, క్సిలినిక్స్, మైక్రోసోఫ్ట్, ఇన్ఫోసిస్, ఒరాకిల్, టీసీఎస్, ఐబీఎం, టెక్‌మహీంద్ర, కాగ్నిజెంట్, విప్రో తమ కార్యకలాపాలను విస్తరించాయి. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో నెలకొల్పిన టీహబ్-1, టీహబ్-2 సాంకేతికరంగ అభివృద్ధిలో సృష్టిస్తున్న అద్భుతాలు ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
ఐటీ రంగ విస్తరణ మిగతా రంగాలైన నిర్మాణ, రవాణా, వినోద రంగాలపై సైతం ప్రభావం చూపుతోంది. టైర్-2 నగరాల్లో సైతం ఐటీ టవర్లను నిర్మిస్తూ స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఐటీ శాఖ చర్యలు చేపట్టింది. ప్రపంచ దిగ్గజ సంస్థ అమెజాన్ రూ.20,761 కోట్లతో ఫాబ్సిటీ, ఫార్మాసిటీ, చందనవెల్లిలో 3 డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూ.500 కోట్లతో స్మార్ట్ డాటా సెంటర్‌ను నెలకొల్పింది. సేల్స్‌ఫోర్స్ సంస్థ రూ.1,119 కోట్లతో విస్తరణ చేపట్టింది. గోల్డ్‌మాన్ శాచ్స్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు ద్వారా 2,500 మందికి ఉద్యోగాలు లభించాయి. అమెరికన్ బీమారంగ కంపెనీ మసాచూసెట్ మ్యూచువల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ రూ.1,000 కోట్లతో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.
ప్రముఖ ఐటీ కంపెనీలకు హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారింది. కార్పొరేట్ రంగంలోనే ప్రముఖ కంపెనీలు తమ అతి పెద్ద, రెండో అతి పెద్ద క్యాంపస్‌లను ఇప్పటికే ఏర్పాటు చేశాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఆవిష్కరణలకు కేంద్రంగా ఉన్న టీహబ్ తరహాలోనే హార్డ్‌వేర్ రంగంలో సైతం నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద ప్రొటోటైపింగ్ సెంటర్‌ను టీ-వర్క్స్ పేరుతో ఏర్పాటు చేసింది. పైసా ఖర్చు లేకుండా ఆవిష్కర్తలు తమ సరికొత్త ఆలోచనల మేరకు ఉత్పత్తులను ఆవిష్కరించుకోవచ్చు.
అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలైన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, బ్లాక్‌చైన్, క్లౌడ్, డ్రోన్స్, ఐవోటీ, రోబోటిక్స్, స్పేస్టెక్నాలజీపై పలు ప్రాజెక్టులను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో కలిసి చేపడుతోంది. టీహబ్‌కు వచ్చిన స్పందనతో తెలంగాణ ప్రభుత్వం రూ.400 కోట్లతో 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీహబ్-2ను ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్‌గా భారీస్థాయిలో నిర్మించింది.