Hyderabad: క్రికెట్ ఫ్యాన్స్ టార్గెట్ గా బ్లాక్ టిక్కెట్ల దందా
Hyderabad Uppal Cricket Match Black tickets
హైదరాబాద్ లో బ్లాక్ దందా మొదలయింది. కొందరు కేటుగాళ్లు క్రికెట్ అభిమానులను టార్గెట్ చేస్తున్నారు. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు ఉబలాటపుడుతున్న వారికి గాలం వేస్తున్నారు. ఉప్పల్ మ్యాచ్ టిక్కెట్లను రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. ఆలన లైన్ వేదికగా బేరసారాలు జరుపుతున్నారు. టిక్కెట్లు కావలసిని వారు తమను సంప్రదించాలంటూ నేరుగా సోసల్ మీడియా ఖాతాలలో వివరాలు ఇస్తున్నారు. బ్లాక్ టికెట్ అమ్మకాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని HCA అధ్యక్షుడు అజారుద్దీన్ తెలిపినా ప్రయోజనం లేకుండా పోతోంది.
జనవరి 13న 6 వేల టికెట్లు, జనవరి 14వ తేదీన 7 వేల టికెట్లు విక్రయించారు. మరో 7 వేల టిక్కెట్లను జనవరి 15న విక్రయించారు. మిగతా టిక్కెట్లను జనవరి 16న విక్రయించారు. ఆన్ లైన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్న వాళ్లు Lb స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో ఫిజికల్ టికెట్లు అందుకుంటున్నారు.
భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే జరగనున్న ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 39,112. నాలుగు రోజుల పాటు 29, 417 టికెట్స్ అమ్మకానికి ఉంచారు. మిగతావి కాంప్లిమెంటరీ పాసులు కింద హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తమ వద్దనే ఉంచుకుంది.