Hyderabad: హైదరాబాద్ చైతన్యపురి లో పోలీసుల ఓవర్ యాక్షన్
Hyderabad: హైదరాబాద్ లోని చైతన్యపురి లో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాల పై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో అటువైపుగా బైక్ పై వస్తున్న ఓ యువకుడిని ఆపడానికి ప్రయత్నించారు పోలీసులు. అయితే ఆయువకుడు బైక్ ఆపకుండావెళ్లిపోయాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ అతనిపైకి ఫైబర్ లాఠీ విసిరాడు.
వివరాల్లోకి వెళితే.. నగరంలో టాఫిక్ పోలీసులు ఈమధ్య వాహనాల తనిఖీని ఎక్కువగా చేపడుతుంది. హైదరాబాద్ లో ఏ రోడ్డును చూసిన ట్రాఫిక్ సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తుంది. సరైన పత్రాలు లేనివారికి అక్కడే చలాన్లు కట్టాలని హుకుంజారీచేస్తునారు. ఒకవేళ చలాన్ కట్టకపోతే బైక్ ను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నాగోల్, చైతన్యపురి రోడ్డులో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కేధారినాథ్ అనే యువకుడు బైక్ ఆపకుండా వెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో తనిఖీ చేస్తున్న ఎస్ఐ అతనిపైకి లాఠీ విసిరాడు. అది అతని తలకుగట్టిగా తగలడంతో కేధారినాథ్ అదుపు తప్పి బైక్ నుంచి కిందపడిపోయాడు.
కిందపడిన కేధారినాథ్ కు తీవ్రగాయాలవడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. బైక్ ఆపకుంటే పోలీసులు ఇలా దాడి చేస్తారా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐ ప్రసాద్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.