Hyderabad: ఐటీ రంగంలో హైదరాబాద్ టాప్
Hyderabad: ఐటీ రంగంలో తెలంగాణ అద్భుత పురోగతి సాధిస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగ ఎగుమతులు భారీగా పెరిగాయి. 2014-15లో రూ.57,000 కోట్లుగా ఉంటే 2021-22 నాటికి 1,83,000 కోట్లకు పెరిగాయన్నారు కేటీఆర్. హైదరాబాద్‌లో బాష్ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ నూతన స్మార్ట్ క్యాంపస్‌ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. వివిధ కారణాల వల్ల హైదరాబాద్, తెలంగాణలో పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయంగా మారాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన బెంగళూరుకు నిన్నటివరకు దీటుగా నిలిచిన మన హైటెక్ సిటీ ఇకమీదట దూకుడుగా దాటేయనుంది. ఈ క్రమంలో తొలి అడుగుపడింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో దేశవ్యాప్తంగా ఏటా కొత్త ఉద్యోగాల కల్పనలో టాప్‌లో ఉంటున్న బెంగళూరును తొలిసారి హైదరాబాద్ వెనక్కునెట్టేసింది.
నాస్కామ్ అంచనా ప్రకారం ఐటీ రంగంలో దేశవ్యాప్తంగా 4.5 లక్షల కొత్త ఉద్యోగాలు రాగా.. అందులో మూడో వంతు తెలంగాణ ఐటీ రంగం వాటానే ఉండటం విశేషం. బెంగళూరులో ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏర్పాటుచేసి ఆహ్వానం పలుకుతుండడంతో కంపెనీలు ఆసక్తి చూపించేవి. అయితే ఈ దిశగా హైదరాబాద్ ఐటీ కారిడార్ కొన్నేళ్లలో ఎంతో వృద్ధి సాధించింది. కంపెనీలు కొలువైన ప్రాంతాల్లో మౌలిక వసతులపై ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు కావాల్సిన ఆఫీస్ స్పేస్ సైతం ఇక్కడ గణనీయంగా పెరుగుతోంది. ఎనిమిదేళ్లలో జెడ్‌ఎఫ్, ఫిస్కర్, స్టెల్లాంటిస్, హ్యుందాయ్ మరియు బిలిటీ తమ క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబడ్డాయి.
టీసీఎస్ కు వివిధ నగరాల్లో కార్యాలయాలున్నా.. ఎక్కువమంది పనిచేసేది హైదరాబాద్‌లోనే అని వాణిజ్యాలెక్కలు తెలుపుతున్నాయి. వేరే చోటుకు వెళ్ళడానికి టెక్కీలు ఒప్పుకోవడంలేదు. ఎందుకంటే హైదరాబాద్ లివింగ్ కాస్ట్ కొంచం తక్కువే.. టీసీఎస్ తొలుత ఒక కార్యాలయాన్ని మాత్రమే ప్రారంభించినా నాలుగుకు విస్తరించింది. మైక్రోసాఫ్ట్ అతి పెద్ద డేటా సెంటర్‌ను నెలకొల్పుతోంది.
హైదరాబాద్ లోనే కాకుండా వివిధ జిల్లాల నలుమూలలా ఐటీ జోన్‌లను విస్తరిస్తున్నాం. మహా నగరాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లోనూ పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చన్న నానుడిని నిజం వచేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. దృక్పథం కంపెనీల్లోనూ పెరుగుతోంది. ‘జోహో’ సంస్థ.. తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లోనూ కార్యాలయాలు నెలకొల్పింది. ఈ విధానం భవిష్యత్తులో విస్తరిస్తుంది. గ్రామీణ యువకుడు ఐటీ ఉద్యోగం కోసం మహా నగరానికే రావాల్సిన అవసరం ఉండదు. ఇదే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఐటీని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకూ విస్తరిస్తోంది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌లో ఐటీ హబ్స్ ప్రారంభించాం అని మంత్రి కేటీఆర్ తెలిపారు.