Swiggy Delevery Boy Died: ఫుడ్ డెలివరీకి వెళ్లిన బాయ్ మృతి.. అసలేంజరిగింది
Swiggy Delevery Boy Died: హైదరాబాద్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బంజారాహిల్స్ పరిధిలో పార్శిల్ ఇవ్వడానికి వెళ్లిన డెలివరీ బాయ్‌పై పెంపుడు కుక్క దాడి చేయడంతో మూడో అంతస్తు నుంచి కిందకు దూకాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. వివరాలలోకి వెళితే బంజారాహిల్స్ రోడ్ నం.12లోని శ్రీరాంనగర్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్ మూడేండ్లగా స్విగ్గీస్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 9వ తేదీ రాత్రి పదిన్నర ప్రాంతంలో బంజారాహిల్స్ రోడ్ నం. 6 లుంబినీ రాక్ కాజిల్ అపార్ట్‌మెంట్స్‌లోని మూడో ఫ్లోర్‌లో ఉంటున్న శోభన నాగానికి ఫుడ్ పార్సల్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్లాడు. ఫ్లాట్ వద్దకు వెళ్లి డోర్ కొట్టగానే లోపల నుంచి వారి పెంపుడు కుక్క అతడి మీద దాడి చేసింది.
యజమాని ఎంత ఆగపట్టిన కూడా ఆ కుక్క అతనిపై దాడి చేస్తూనేఉంది.. దీంతో భయపడిన రిజ్వాన్ కిందకు పరుగులు పెట్టాడు అతడి వెంటే ఆ కుక్క వెంబడించసాగింది. ఈ క్రమంలో మూడవ అంతస్తు రెయిలింగ్ మీద నుంచి కిందపడిన రిజ్వాన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఫ్లాట్ యజమాని శోభన అతడిని నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. మృత్యువుతో పోరాడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ ఘటనకు కారణమైన శోభన నాగానిపై పోలీసులు కేసు నమోదు చేసారు.