Student Dies With Cardiac Arrest: హైదరాబాద్ లో గుండెపోటుతో ఇంజనీరింగ్ విద్యార్ధి మృతి
Student Dies With Cardiac Arrest: తెలంగాణ లో గుండెపోటుతో వరుసగా యువకులు మరణిస్తున్నారు. గుండెపోటు అనే మాట చాలా అరుదుగా వినిపించేది యాబై అరవయేళ్లు మీదపడిన వారే ఎక్కువగా గుండె పోటుకు గురయ్యేవారు. కానీ ప్రస్తుతం మారిన జీవనశైలి,అహారపు అలవాట్ల కారణంగా చిన్న వయసులోనే గుండె పోటుకు గురవుతున్న ఘటనలు అనేకం చూస్తున్నాం. కరోనా తర్వాత యువకుల్లో గుండెపోటులు ఎక్కువయ్యాయి. ఒకేసారి కుప్పకూలి ప్రాణాలు వదులుతున్నారు.
గత పది రోజుల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు పోగా..తాజాగా హైదరాబాద్ సీఎంఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్ మృతి చెందాడు. రాజస్థాన్ కు చెందిన సచిన్ సీఎంఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. కాలేజీలో ఉదయం క్లాసులకు అటెండ్ అయిన సమయంలో కాలేజీ కారిడార్ లో నడుస్తూ నడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతడి స్నేహితులు షాక్ అయ్యారు. అసలేం జరిగిందో అర్థంకాక కంగారు పడ్డారు. వెంటనే అతడిని సీఎంఆర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ స్టూడెంట్ మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఎలా చనిపోయాడన్న విషయంపై డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు. అయితే సచిన్ గుండెపోటుతో కుప్పకూలిన విజువల్స్ కాలేజీ సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి.
ఉదయం క్లాసులకు అటెండ్ అయ్యాడు సచిన్. ఆ తర్వాత మధ్యాహ్నం కాలేజీ ఆవరణలో అప్పటిదాకా తమతో నవ్వుతూ మాట్లాడాడని తన ఫ్రెండ్స్ చెపుతున్నారు. కాసేపు అక్కడ మాట్లాడాక అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నంలో ఒక్కసారిగా అతడు కుప్పకూలాడు. విశాల్ కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని అతడి ఫ్రెండ్స్,తల్లిదండ్రులు చెబుతున్నారు.