దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో హైదరాబాద్ కూడా ఒకటి. గత దశాబ్దకాలంలో ఈ నగరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. నగరంలోని గచ్చిబౌలి, హైటెక్‌సిటి, మాదాపూర్, కొండాపూర్, మణికొండ తదితర ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు గణనీయంగా పెరిగాయి.
Hyderabad New Bus Stand: దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో హైదరాబాద్ కూడా ఒకటి. గత దశాబ్దకాలంలో ఈ నగరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. నగరంలోని గచ్చిబౌలి, హైటెక్‌సిటి, మాదాపూర్, కొండాపూర్, మణికొండ తదితర ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు గణనీయంగా పెరిగాయి. నగరంలో అత్యంత విలువలైన, అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇవి ప్రథమస్థానంలో ఉన్నాయి. ఈ ప్రాంతానికి నిత్యం లక్షలాది మంది వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగం కోసం వస్తుంటారు. ఇక్కడే అనేక జననివాసాలు కూడా ఉన్నాయి. ఖరీదైన నివాసాలతో పాటు మధ్యతరగతి ప్రజలు కూడా నివశిస్తుంటారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చి అక్కడే ఇళ్లు తీసుకొని నివశిస్తున్నారు. ఈ ప్రాంతాల నుంచి సొంత గ్రామాలకు లేదా సొంత నగరాలకు వెళ్లాలి అనుకునేవారు సొంత కార్లలో లేదా రైళ్లు ఆశ్రయిస్తున్నారు. బస్సు ప్రయాణాలు చేయాలి అంటే ఎంజీబీఎస్‌కు వెళ్లాలి. ఆర్టీసీ బస్సులు బీహెచ్ఈఎల్, కూకట్పల్లి మీదుగా ఎంజీబీఎస్ చేరుకుంటాయి. ఆ మార్గంలోనే వెళ్లాల్సి ఉంటుంది. బెంగళూరు వైపు వెళ్లాలి అంటే మెహదీపట్నం వరకు చేరుకోవలసి ఉంటుంది.
పెరుగుతున్న రద్దీ
నగరానికి ఆదాయాన్ని సమకూరుస్తున్న గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, మణికొండ వంటి ప్రాంతాల గుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు లేదా నగరాలకు బస్సు సౌకర్యాలు అందుబాటులో లేవు. దీంతో ఈ ప్రాంతాల నుంచి సొంత గ్రామాలకు వెళ్లేవారు తప్పనిసరిగా ఎంజీబీఎస్ చేరుకొని అక్కడి నుండి ప్రయాణాలు చేస్తున్నారు. పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎంజీబీఎస్ మాదిరిగానే మరో బస్టాండ్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. ఎంజీబీఎస్ బస్టాండ్ పాతది కావడం, పైగా దూరంగా ఉండటంతో ఓఆర్ఆర్ గచ్చిబౌలి ప్రాంతంలో మరో బస్టాండ్‌ను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
నూతన బస్టాండ్ డిమాండ్
ఈ ప్రాంతంలో నూతన బస్టాండ్‌ను ఏర్పాటు చేయడం వలన ఇటువైపు నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రయాణాలు సాగించేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హైటెక్ సిటీ నుండి రాష్ట్రంలోని ముఖ్యనగరాలకు, ఏపీ, తమిళనాడు, బెంగళూరు, మహారాష్ట్రలోని ముఖ్యనగరాలకు మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. తద్వారా ఆయా రాష్ట్రాలకు, నగరాలకు ప్రయాణాలు చేసేవారి సంఖ్య పెరుగుతుంది.
ఎంజీబీఎస్ కు వస్తున్న ఆదాయం కంటే, ఈ ప్రాంతంలో మరో బస్టాండ్‌ను ఏర్పాటు చేయడం వలన రద్దీ పెరిగుతుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. నగరంలో ఎంజీబీఎస్, జేబీఎస్ అనే రెండు బస్టాండ్లు ఉన్నాయి. రద్దీని దృష్టిలో పెట్టుకొని మూడో బస్టాండ్‌ను కూడా ఏర్పాటు చేస్తే మంచిదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఓఆర్ఆర్- శంషాబాద్ రోడ్డు నిత్యం బిజీగా ఉంటున్నది. ఈ ప్రాంతంలో నూతన బస్టాండ్ ఏర్పాటు చేస్తే శంషాబాద్‌కు బస్సుల్లోనే ప్రయాణాలు కొనసాగే అవకాశాలు ఉంటాయి. సొంతవాహానాల్లో ప్రయాణాలు తగ్గిపోతాయి. పబ్లిక్ రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడం ప్రభుత్వానికి మేలు. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి నూతల బస్టాండ్‌ను ఏర్పాటు చేయడం ఉత్తమం.
నగరంలో జనాభా ఇప్పటికే కోటి దాటిపోయింది. ఒకప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం చేయాలంటే గంటల తరబడి సమయం పడుతున్నది. పైగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో బస్టాండ్ ఉండే అక్కడి నుంచి షార్ట్‌కట్ రూట్లు మొదలౌతాయి. ప్రస్తుతం ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి, కోటి నుంచి లోకల్ బస్సులు నగరంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణాలు సాగిస్తున్నాయి. అదే గచ్చిబౌలి ప్రాంతంలో నూతన బస్టాండ్‌ను ఏర్పాటు చేస్తే, అక్కడి నుంచి రద్దీగా ఉండే కొండాపూర్, హైటెక్‌సిటీ, బీహెచ్ఈఎల్, మాదాపూర్, కూకట్పల్లి, మణికొండ వంటి ప్రాంతాలకు లోకల్ బస్సుల రవాణా పెరుగుతుంది. లోకల్ బస్సుల కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా షార్ట్ కట్ జర్నీలు ప్రారంభం అవుతాయి. ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. చాలా కాలంగా మరో నూతన బస్టాండ్ ఏర్పాటు కావాలనే డిమాండ్ ఉన్నది. ఈ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతున్నది. ప్రభుత్వం ఈ విషయంలో వీలైనంత త్వరగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.