Hyderabad Metro Charges Hike: హైదరాబాద్ మెట్రో చార్జీల పెంపుకు సిద్ధం
Hyderabad Metro Charges Hike: హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకున్నది. త్వరలోనే మెట్రో చార్జీలను పెంచేందుకు సిద్ధమౌతున్నది. దీనకోసం ప్రత్యేకంగా ఫేర్ ఫిక్సేషన్ పేరుతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మెట్రో చార్జీలను నిర్ణయించే అవకాశం ఉన్నది. ఈ కమిటీ చార్జీల పెంపుపై నివేదికను సమర్పించిన అనంతరం మెట్రో చార్జీలు పెంచే అవకాశం ఉన్నది. మెట్రో కోసం వేర్వేరు ప్రాంతాల్లో భూములు లీజుకు ఇచ్చారు. మెట్రో నిర్మాణం కోసం ఎల్ అండ్ టీ రూ. 13 వేల కోట్లను ఖర్చు చేసింది. ఈ ఖర్చును రాబట్టుకునేందుకు ఎల్ అండ్ టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇక మెట్రో వ్యవస్థ ప్రభుత్వాన్ని మూడు వేల కోట్ల రుణం కావాలని కోరింది. మెట్రో చార్జీల పెంపుతో ఖర్చును రాబట్టుకోవాలని నిర్ణయించింది.
ఇక ఇదిలా ఉంటే, రాయ్ దుర్గ్ నుండి శంషాబాద్ వరకు ఎయిర్ పోర్ట్ మెట్రోను ఏర్పాటు చేయనున్నారు. 31కిమీ పొడవైన ఈ ఎయిర్‌పోర్ట్ మెట్రో కోసం ప్రభుత్వం ఆరువేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నది. మూడేళ్ల వ్యవధిలో ఈ నిర్మాణం పూర్తి కావాలని నిర్ణయించింది. ప్రస్తుతం సర్వేను నిర్వహిస్తున్నారు. మొత్తం 26 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎయిర్‌పోర్ట్ మెట్రో నిర్మాణం పూర్తయితే ఎయిర్‌పోర్ట్ కు వెళ్లే ప్రయాణికుల సంఖ్య మరింతగా పెరుగుతుందని, ఎయిర్‌పోర్ట్ పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందుతుందని అధికారులు చెబుతున్నారు.