సమ్మర్ వస్తే చాలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంట్లో తప్పనిసరిగా మామిడికాయలు కనువిందు చేస్తుంటాయి. స్థోమతను బట్టి కాయలు కొనుగోలు చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కడ కాపు వచ్చినా అవన్నీ చివరకు హైదరాబాద్ మార్కెట్‌కు తరలిరావాల్సిందే. ఒకప్పుడు కొత్తపేటలోని గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్‌కు మామిడికాయలతో కూడిన లారీలు క్యూలు కడుతుండేవి.
Hyderabad Mango Market: సమ్మర్ వస్తే చాలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంట్లో తప్పనిసరిగా మామిడికాయలు కనువిందు చేస్తుంటాయి. స్థోమతను బట్టి కాయలు కొనుగోలు చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కడ కాపు వచ్చినా అవన్నీ చివరకు హైదరాబాద్ మార్కెట్‌కు తరలిరావాల్సిందే. ఒకప్పుడు కొత్తపేటలోని గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్‌కు మామిడికాయలతో కూడిన లారీలు క్యూలు కడుతుండేవి. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు, హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుండేది. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్‌కు వచ్చిన మామిడి కాయలు బయట మార్కెట్లో దొరికే వాటికంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి. అందుకే లోడ్ వచ్చిన వెంటనే వ్యాపారుల నుంచి సామాన్య ప్రజల వరకు కొత్తపేట మార్కెట్‌కు వెళ్లి కొనుగోలు చేస్తుంటారు.
కొత్తపేట్ ఫ్రూట్ మార్కెట్
వందల సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరంలో పండ్ల అమ్మకాలు, కొనుగోలు కోసం దశాబ్దాల క్రితమే కొత్తపేటలోని గడ్డిఅన్నారంలో ఫ్రూట్ మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు పండిండిన పండ్లను కొత్తపేట్ ఫ్రూట్ మార్కెట్‌కు తీసుకొచ్చి అమ్ముకుంటుండేవారు. ఆ తరువాత ఏపీ నుంచి మామిడి పండ్లు కొత్తపేట రావడం మొదలుపెట్టాయి. ఒక్క ఏపీ నుంచే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా అక్కడ పండే మామిడి కాయలు హైదరాబాద్ ఫ్రూట్ మార్కెట్‌కు తరలించారు. అయితే, కొత్త రాష్ట్రం ఏర్పాటయ్యాక విస్తరణలో భాగంగా కొత్త పేట్ మార్కెట్‌ను అక్కడి నుంచి కొహెడకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో భాగంగానే ఫ్రూట్ మార్కెట్‌ను కొహెడకు తరలించారు. కొత్తపేట మార్కెట్‌ను పూర్తిగా నేలమట్టం చేశారు. అయితే, మొదట్టో వ్యాపారులు కొహెడ ప్రాంతానికి వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. కారణం రవాణా సౌకర్యాలు లేక వ్యాపారం మందగించడమే. ఇప్పుడు కొంతమేర పరిస్థితులు మెరుగుపడినా వ్యాపారం అంతంత మాత్రంగానే ఉన్నది.
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో మామిడి కాయల లారీలు కొహెడ ఫ్రూట్ మార్కెట్‌కు వస్తున్నది. తొతాపురి, బంగినపల్లి, రసాలు, చిత్తూరు కాయలతో కూడిన లారీలు కొహెడ బాటలు పడుతున్నాయి. వర్షాల కారణంగా మామిడి రైతులు చాలా వరకు నష్టపోయారు. అయితే, గత నెల రోజులుగా వాతావరణం అనుకూలంగా మారడంతో పంట దిగుబడి చేతికి వచ్చింది. దీంతో రైతులు మామిడి కాయలను కొహెడ ఫ్రూట్ మార్కెట్‌కు తరలించి అమ్మకాలు జరుపుతున్నారు. సమ్మర్ ప్రారంభంలో మామిడికాయల ధరలు ఆకాశాన్ని తాకగా, ఇప్పుడు ధరలు అందుబాటులోకి వచ్చాయి. నాణ్యతను, కాయల రకాన్ని బట్టి కేజీ రూ. 100 నుంచి 250 వరకు పలుకుతున్నాయి. ఇక ఈ సీజన్లో దొరికే అల్ఫాన్సో రకం మామిడికి భారీ డిమాండ్ ఉంటుంది. డజను కాయల ధర రూ. 1300 నుంచి రూ. 1600 వరకు పలుకుతుంది. ధరలు ఎక్కువైనా అల్ఫాన్సో కాయలకోసం జనాలు క్యూ కడుతున్నారు. ప్రతి ఏడాది రసాలకు భారీ డిమాండ్ ఉంటుంది.
తెలంగాణలోనూ కొన్ని ప్రాంతాల్లో మామిడి పంటలు పండిస్తున్నారు. ఈ పంట కూడా చేతికి రావడంతో కొహెడ మార్కెట్లు మామిడికాయలతో కళకళలాడుతున్నాయి. ఇక్కడి నుంచే వ్యాపారులు విదేశాలకు సైతం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. రసాలు, చిత్తూరు మామిడి, అల్ఫాన్సో మామిడిని ఎక్కువగా ఎగుమతి చేస్తుంటారు. తొతాపురి కాయలకు హైదరాబాద్ నగరంలో డిమాండ్ ఉంటుంది.