హైదరాబాద్‌లో ల్యాండ్ డీల్స్ ఎలా జరుగుతున్నాయో తెలుసా?
Hyderabad land deals are increasing day by day
హైదరాబాద్ నగరంలో ల్యాండ్ డీలింగ్స్ రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే రికార్డు స్థాయిలో పెరిగాయి. మన దేశంలో 8 నగరాల్లో ల్యాండ్ డీలింగ్స్ విషయాలను పరిశీలిస్తే హైదరాబాద్ నగరంలోనే ఎక్కువ డీల్స్ జరిగినట్లు తెలిసింది.
2022 ఏడాదిలో మొదటి 9 నెలల కాలంలో జరిగిన 68 ఒప్పందాల ద్వారా 1656 ఎకరాల లావాదేవీలు జరగగా..అత్యధికంగా హైదరాబాద్‌లోనే చోటు చేసుకున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌లో 7 డీల్స్ ద్వారా 769 ఎకరాల ట్రాన్జాక్షన్స్ జరిగినట్లు అనరాక్ చేపట్టిన సర్వేలో తేలింది.
ఈ ఏడాది జరిగిన ల్యాండ్ డీలింగ్స్ లో విస్తీర్ణం పరంగా అత్యధికంగా హైదరాబాద్‌లోనే జరిగాయి. 46 శాతం వాటాతో హైదరాబాద్ ప్రథన స్థానంలో నిలిచింది. 14 శాతంతో ఎన్‌సీఆర్ రెండో స్థానంలో నిలిచింది. 13 శాతంతో బెంగళూర్ మూడో స్థానంలో నిలిచింది. ముంబైలో జరిగిన ల్యాండ్ డీల్స్ అన్నీ చిన్నవిగా ఉన్నట్లు సర్వేలో తేలింది.