Hyderabad Kite Festival: హైదరాబాద్ లో అంబరాన్నంటిన కైట్ ఫెస్టివెల్
Hyderabad Kite Festival: సంక్రాంతి అంటే ఆడపడుచులు రంగు రంగుల ముగ్గుల వేసి.. గొబ్బెమ్మలు పెడతూ రకరకాల పిండివంటలు చేస్తూ తెగ సంబరపడుతుంటారు. అలాగే ఇంట్లోని మొగవారుకూడా సంక్రాంతి వచ్చిందంటే ఎక్కడలేని సంతోషం వారి సొంతం అవుతుంది. ఓవైపు సంక్రాంతి మరోవైపు కైట్ ఫెస్టివెల్. పతంగులు ఎగురేయడానికి ఉదయాన్నే మిద్దెమీదకు చేరుకొని పక్క వారి పతంగులను తెంపడానికి ప్రయత్నిస్తుంటారు.
హైదరాబాద్ లో కైట్ ఫెస్టివెల్ ఘనంగా జరిగింది. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో కైట్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే చిన్నారులకు పతంగులను పంపిణీ చేశారు. అనంతరం అందరితో కలిసి మంత్రి తలసాని పతంగి ఎగుర వేశారు. రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఆదివారం పీపుల్స్ ప్లాజాలో ఎక్కడ చూసిన గాల్లో దాదాపుగా 1000 పతంగులు గాల్లో ఎగిరాయి. ఇక ఈ పీపుల్స్ ప్లాజాలో జరిగినా సంబరాల్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ కార్పొరేటర్ పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి ఈ కార్యక్రంలో పాల్గొని కైట్స్ ఎగరేశారు.
ఇక ఓల్డ్ సిటీలో నైట్ కైట్ ఫెస్టివల్ కుర్రకారును హుషారెత్తించింది. బేగంబజార్‌లో ఫ్లడ్ లైట్ల వెలుగులో పతంగుల పోటీలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా నైట్ కైట్ ఫెస్టివల్‌లో ఓల్డ్ సిటీ వాసులు పాల్గొన్నారు. బేగంబజార్, గోషామహల్‌లో డీజేలు మోతతో నైట్ కైట్ ఫెస్టివల్ మోత మోగింది.