Hyderabad: హైదరాబాద్ అద్భుత నగరం..యూఏఈ రాయబారి
Hyderabad: వందల ఏండ్ల చారిత్రక నగరం.. ఎన్నో విశేషాలు, మరెన్నో గొప్పగొప్ప ఆనవాళ్లు.. చరిత్ర పుటల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొన్న నగరం మన హైదరాబాద్. అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు నగరానికి వన్నె తెస్తున్నాయి. ఆకాశాన్నంటే భవనాల్లో ఐటీ కంపెనీలు, విదేశాల తరహాలో స్కైవేలు, తెలంగాణకు హారితహారంతో హైదరాబాద్ చుట్టూ పరుచుకున్న పచ్చందాలు నగరానికి అందిస్తున్నాయని యూఏఈ రాయబారి మంత్రి కేటీఆర్‌తో మీట్ సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేసారు.
ప్రగతిభవన్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ పారిశ్రామికరంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయనకు వివరించారు. ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలను పెంచేలా చేపట్టిన టీ హబ్ నిర్మాణం ఐటీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణల దిశను మార్చేసిందన్నారు.
యూఏఈ లోని వెంచర్ క్యాపిటలిస్టులను టీ హబ్‌కు పరిచయం చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. దీనిపై యూఏఈ రాయబారి సానుకూలంగా స్పందిస్తూ.. తమ దేశంలోని ఔత్సాహిక వెంచర్ క్యాపిటలిస్టులను హైదరాబాద్ ఇకో సిస్టంలోని స్టార్టప్ సంస్థలతో అనుసంధానం చేసేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. అల్‌షాలీ హైదరాబాద్‌లోని టీహబ్‌ను సైతం సందర్శించారు. టీ హబ్‌కు వెళ్లిన ఆయన చాలా ప్రగతిశీలమైన అభివృద్ధిని చూశానని అన్నారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఇలాంటి అనుభూతిని పొందలేదని, టీ-హబ్ చాలా అద్భుతంగా ఉన్నదని మెచ్చుకున్నారు.