Hyderabad: హైదరాబాద్‌లో కొద్దిరోజులుగా కుక్కల (Dogs) దాడులు పెరిగిపోతున్నాయి. ఇన్ని రోజులు వీధికుక్కలతోనే ప్రమాదాలు జరుగుతుండగా.. ఇప్పుడు పెంపుడు కుక్కల వల్ల కూడా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
Hyderabad: హైదరాబాద్‌లో కొద్దిరోజులుగా కుక్కల (Dogs) దాడులు పెరిగిపోతున్నాయి. ఇన్ని రోజులు వీధికుక్కలతోనే ప్రమాదాలు జరుగుతుండగా.. ఇప్పుడు పెంపుడు కుక్కల వల్ల కూడా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పార్సిల్ ఇవ్వడానికి వెళ్లిన ఓ డెలివరీ బాయ్ పైకి కస్టమర్ ఇంటి ముందు ఉన్న కుక్క దూసుకొచ్చింది. భయాందోళనలకు గురైన కస్టమర్ మూడో అంతస్థు నుంచి దూకేశాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. రాయదుర్గంలోని పంచవటి కాలనీలో చోటుచేసుకుంది ఈ ఘటన.
పంచవటి కాలనీకి చెందిన ఓ వ్యక్తి అమెజాన్‌లో ఓ వస్తువును ఆర్డర్ చేశాడు. అయితే ఈరోజు దానిని ఇవ్వడం కోసం డెలివరి బాయ్ కస్టమర్ ఇంటికి వెళ్లాడు. అపార్ట్మెంట్లోని మూడో ఫ్లోర్‌కి వెళ్లగానే కస్టమర్ ఇంటి నుంచి ఒక్కసారిగా డాబర్మాన్ కుక్క దూసుకొచ్చింది. తనను కరిచేందుకే వస్తుందని భయపడిన డెలివరీ బాయ్ ఒక్కసారిగా మూడో ఫ్లోర్ నుంచి బయటకి జంప్ చేశాడు. దీంతో డెలివరీ బాయ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి.
ఇక వెంటనే స్పందించిన స్థానికులు అంబులెన్స్ సాయంతో డెలివరీ బాయ్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం చోటుచేసుకుంది.
ఇకపోతే ఇటువంటి ఘటనే హైదరాబాద్‌లో ఈ ఏడాది జనవరలో కూడా జరిగింది. స్విగ్గీ డెలివరీ బాయ్ రిజ్వాన్ ఫుడ్ డెలివరీ చేయడానికి బంజారాహిల్స్‌లోని ఓ ఇంటికి వెళ్లాడు. మూడో ఫ్లోర్‌కి వెళ్లి ఇంటి బెల్ కొట్టగానే ఓ కుక్క వచ్చి అతడిపై దాడి చేసింది. దీంతో రిజ్వాన్ బయపడి బిల్డింగ్‌పై నుంచి కిందికి దూకాడు. తీవ్రంగా గాయపడడంతో అతడిని యశోధ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రిజ్వాన్ కన్నుమూశాడు.