Honey trap Gang: హనీ ట్రాప్ గ్యాంగ్ ఆటకట్టించిన హైదరాబాద్ పోలీసులు
Hyderabad Central Zone Police busted Honey trap Gang
హైదరాబాద్ పోలీసుటు ఓ హనీట్రాప్ గ్యాంగ్ గుట్టు రట్టు చేశారు. మహిళతో పాటు 9 మందిని సెంట్రల్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. హోమ్ డెలివరీ పేరుతో మహిళ హనీ ట్రాప్ చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో పోలీసులు రంగంలో దిగారు. చాకచక్యంగా హనీ ట్రాప్ ముఠాను పట్టుకున్నారు.
కొంత మంది అమాయకులను టార్గెట్ చేస్తున్న ఓ యువతి వారితో పరిచయాలు పెంచుకుంటోంది. ఫోటోలు దిగుతోంది. ఫోటోలు దిగిన మరుసటి రోజే తన గ్యాంగ్ తో సహా ఫోటో దిగిన యువకుడి ఇంటి ముందు ప్రత్యక్షం అవుతోంది. తనతో ఫోటోలు దిగి తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆ యువకుడి ఇంటి ముందు హంగామా చేస్తోంది. వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తన ముఠాతో కలిసి వచ్చి బెదిరింపులకు పాల్పడుతోంది. బెదిరిపోతున్న యువకుల నుంచి అందినకాడికి దోచుకుపోతోంది.
ఇలా అనేక మంది యువకులు లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. అందులో కొందరు పోలీసులను ఆశ్రయించారు, ఒక్క సెంట్రల్ జోన్ లోనే ఆరు కేసులు నమోదయ్యాయి. దీంతో రంగంలో దిగిన పోలీసులు హనీ ట్రాప్ గ్యాంగ్ ను చాకచక్యంగా పట్టుకున్నారు.