Sankranthi Rush: సొంతూళ్ళకు పయనమైన జనం.. కిటకిటలాడుతున్న రోడ్లు!
Huge Rush at Railway Station and Bus Stations: సంక్రాంతి పండుగకు పట్టణ వాసులు అందరూ సొంతూళ్లకు బయలుదేరుతున్నారు, దానికి తోడు విద్యా సంస్థలకు కూడా వారం రోజుల సెలవులు రావడంతో అందరూ తమ తమ స్వగ్రామానికి పయనమయ్యారు. దీంతో తెలంగాణలో ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు ప్రధాన కూడళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో రైళ్లు, బస్సులలో సీట్లు దొరకక ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా జూబిలీ బస్ స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. పండగకు సొంత ఊళ్లకు బయలుదేరిన ప్రయాణికుల దెబ్బకు అన్ని చోట్లా కోలాహలం నెలకొంది. ఈ ఏడాది 4233 అదనపు బస్సులు, 150 సంక్రాంతి ట్రైన్స్ వేశారు, సుదూర ప్రాంతాలకు 585 బస్సు సర్వీసులు కూడా నడుపుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి పండగకు అదనపు చార్జీలు లేకుండా 10 శాతం డిస్కౌంట్ కూడా ప్రకటించింది ఆర్టీసీ. రెండు నెలలుగా ట్రైన్స్ లో వందలాది వెయిటింగ్ లిస్ట్ ఉండడంతో రైళ్లలో రిజర్వేషన్ కన్ఫర్మ్ కాక జనరల్ బోగీల్లో కిక్కిరిసి వెళుతున్నారు ప్రయాణికులు. ఈ రోజు ఆఫీసుల్లో వర్క్ పూర్తి చేసుకుని సొంత ఊళ్లకు ఇప్పుడిప్పుడే బయలుదేరుతున్నారు ప్రయాణికులు. ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు భారీగా దోపిడీ చేస్తున్నారు, హైదరాబాద్ – వైజాగ్ నాలుగు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు.