Fire Accident: నాంపల్లి ఎగ్జిబిషన్ పార్కింగ్ లో భారీ అగ్నిప్రమాదం!
Fire Accident: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ పార్కింగ్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ కోసం ఏర్పాటు చేసిన పార్కింగ్ లో ఉన్న కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎలక్ట్రికల్ కార్ లో నుండి మంటలు వ్యాపించినట్లు సమాచారం అందుతోంది. ముందు ఒక కారులో మొదలైన మంటలు ఆ కారు నుంచి మరో నాలుగు కార్లకు మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా కలకలం రేగినట్టు అయింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సమాచారం అందుకున్న అబిడ్స్ పోలీసులు కూడా అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక మరోపక్క నాంపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. అయితే.. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్టుగా చెబుతున్నారు. అయితే శనివారం వీకెండ్ కావడంతో నుమాయిష్‌కు సందర్శకుల రద్దీ ఎక్కువయిందని అంటున్నారు. ప్రతి ఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 తేదీ వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన-నుమాయిష్ ను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం దాదాపు 25 లక్షల మంది సందర్శకులు ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారని అంచనా. దేశ, విదేశాలకు చెందిన ఉత్పత్తులతో నుమాయిష్‌లో 2400 స్టాల్స్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు, ఈ నాంపల్లి ఎగ్జిబిషన్‌కు వచ్చే వారికి ఫ్రీ పార్కింగ్ సదుపాయం కూడా కల్పిస్తారు.